రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా పోయాడని మండిపడ్డారు. కరోనా కట్టడికి కేంద్రం ఎన్ని సహాయ, సహకారాలు అందించినా సద్వినియోగం చేసుకోలేక పోయిందని, పైగా తెరాస నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్రానికి గవర్నర్ ఏం ఫిర్యాదు చేస్తారో చూసి... రాష్ట్ర పార్టీగా తమ అభిప్రాయం తెలియజేస్తామన్నారు. సచివాలయం కూల్చివేత నిర్ణయం చరిత్రలో ఏ పీడకలగా మిగిలిపోతుందని చెప్పారు.
ఇదీ చూడండి: నిమ్స్‌లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు