ETV Bharat / state

RRR టీమ్‌కు బండి సంజయ్ అభినందన.. రాహుల్ సిప్లిగంజ్‌ను కలిసి శుభాకాంక్షలు

Bandi sanjay congratulates RRR movie team : ఆస్కార్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ నామినేట్‌ అయిన సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి అగ్రహీరోలు అభినందనలు తెలపగా.. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నాటు నాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Bandi sanjay
Bandi sanjay
author img

By

Published : Jan 25, 2023, 10:49 AM IST

Bandi sanjay congratulates RRR movie team : ఆస్కార్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ నామినేట్‌ అయిన సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు ప్రముఖల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Bandi sanjay congratulates Rahul Sipligunj : ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న సందర్భంగా ఈ పాట పాడిన టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను బండి సంజయ్ కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపి మిఠాయి తినిపించారు. పూలగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం రాహుల్.. బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు నాటు నాటు పాట పాడారు.

ఇదంతా బండి సంజయ్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. "తన టాలెంట్‌తో ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట పాడి ఆస్కార్ బరిలో నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌ను కలిశాను. ఈ అద్భుత గడియను రాహుల్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. మన హైదరాబాద్ కుర్రాడు పాడిన పాట వరల్డ్ ఫేమస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు నా అభినందనలు. ఇంకా మరెన్నో అంతర్జాతీయ అవార్డులు గెలవాలని కోరుకుంటున్నాను" అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

ఇప్పటికే నటుడు చిరంజీవి కూడా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు తెలిపారు. సినిమా వైభవాన్ని చాటేందుకు ఇంకా ఒక్క అడుగు దూరమే ఉందని, కోట్లాదిమంది ప్రేక్షకులు ఆకాంక్ష, ప్రార్థనలు మార్చి 12న ఫలించాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. చిత్ర దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, ఆ పాట రాసిన రచయిత చంద్రబోస్‌, గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌, హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల ఖాతాలను ట్యాగ్‌ చేస్తూ వారితోపాటు ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నటులు, పలు సినీ నిర్మాణ సంస్థలూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందానికి కంగ్రాట్స్‌ చెబుతున్నాయి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.