ETV Bharat / state

ప్రభుత్వ వైఫల్యాలే నాగులు మరణానికి కారణం: బండి సంజయ్​ - నాగులు మరణంపై బండి సంజయ్​ వ్యాఖ్యలు

ప్రభుత్వ వైఫల్యాలే నాగులు మరణానికి కారణామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్​ రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యా ప్రయత్నం చేసిన నాగులు మరణం ఆయన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన బండి సంజయ్... నేడు తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితికి నాగులు మరణం అద్దం పడుతుందని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాన్ని కాస్తా... అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందని బండి సంజయ్​ దుయ్యబట్టారు.

ప్రభుత్వ వైఫల్యాలే నాగులు మరణానికి కారణం: బండి సంజయ్​

author img

By

Published : Sep 13, 2020, 5:01 AM IST

ప్రభుత్వ వైఫల్యాలే నాగులు మరణానికి కారణామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం... ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం వల్లే ఇంకా ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని మండిపడ్డారు. నాగులు మృతి చాలా దురదృష్టకరమని.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే... నేడు బతకలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.

హైదరాబాద్​ రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యా ప్రయత్నం చేసిన నాగులు మరణం ఆయన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన బండి సంజయ్... నేడు తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితికి నాగులు మరణం అద్దం పడుతుందని పేర్కొన్నారు. అస్తవ్యస్త విధానాలు, దుబారా, క్రమశిక్షణా రాహిత్యంతో ధనిక రాష్ట్రాన్ని కాస్తా... అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందని బండి సంజయ్​ దుయ్యబట్టారు.

ఐదు నెలల నుంచి ప్రైవేటు టీచర్లు, చిరు ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయినా.. ఈ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకునే చర్య ఒక్కటి కూడా చేపట్టకపోవడం దారుణమన్నారు. ఆర్థికంగా రాష్ట్రం దివాలా తియ్యడం వల్లే నేడు ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. నాగులు లాంటి అనేక మంది ప్రైవేటు ఉద్యోగుల దుస్థితికీ ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. నాగులు మరణంతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలని... ఇకనైనా ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులను ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. నాగులు కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు... వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.