టీఎన్జీవో నాయకులకు బంద్‌తో సంబంధం ఏంటని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై కొట్లాడాల్సిన నాయకులు ముఖ్యమంత్రికి మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల డీఏ, ఐఆర్, పీఆర్సీల గురించి మాట్లాడాల్సిన నాయకులు.. తెరాస రాజకీయ ప్రయోజనాలకై ప్రకటనలిస్తున్నారని దుయ్యబట్టారు.
ఆ సంఘాల నేతలు కేసీఆర్‌తో కుమ్మక్కు అయ్యారని విమర్శించారు. అసలు రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్‌లో ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు జోక్యం చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే ఉద్యోగ సంఘాల నాయకులపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇప్పుడు ప్రకటనలిస్తున్న నాయకులు సన్నవడ్లు, రుణమాఫీలపై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. సన్నవడ్లకు కనీస మద్దతు ధర, బోనస్ విషయంలో ఉద్యోగ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఉద్యోగుల మనోభావాలను కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారదని.. ఎప్పటికీ ఒకే పార్టీ అధికారంలో ఉండదు అనే విషయాన్ని ఉద్యోగ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఇదీ చూడండి : 'భారత్ బంద్'కు ఆర్టీసీ సంఘాల మద్దతు