Mahajan Sampark Abhiyan programme In Telangana : విమర్శలు, ప్రతి విమర్శలకు తావు లేకుండా నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనపై తెలంగాణ ప్రజలకు, నాయకులకు వివరించేలా 'మహాజన్ సంపర్క్ అభియాన్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
- MLC Kavitha Bandi Sanjay Chitchat : ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ మాటామంతీ
- Bandi Sanjay: 'ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. సర్వేలన్నీ మాకే అనుకూలం'
పాజిటివ్ దృక్పథంతో విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జూన్ 1నుంచి 7వ తేదీ వరకు మీడియా సమావేశాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వివరించే కార్యక్రమాలు ఉంటాయన్నారు. జూన్ 8 నుంచి 14వతేదీ వరకు పార్టీకి దూరంగా ఉన్న సీనియర్ నాయకులతో సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు. జూన్ 15నుంచి 21 వరకు అసెంబ్లీ వారీగా భారీ బహిరంగ సభలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ తొమ్మిది సంవత్సరాలలో సాధించిన విజయాలపై రూపొందించిన 'సేవా సుషాన్ గరీబ్ కల్యాణ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
BJP schemes explanation on Bandi Sanjay in Telangana : ఈ సందర్బంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించారు. పీఎం అవాస్ యోజన కింద 3లక్షల 50వేల ఇళ్లను ఇచ్చినట్లు గుర్తుచేశారు. జల జీవాన్ మిషన్ కింద 54లక్షల కనెక్షన్‌లు ఇచ్చామన్నారు. కరోనా సమయంలో 7కోట్ల 70లక్షలు డోసుల కరోనా వ్యాక్సిన్‌లు అందించామని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా 39 మంది రైతులు తెలంగాణలో లబ్ధిపొందారని పేర్కొన్నారు. పీఎం అటల్ పింఛన్ 13లక్షల 9వేల164 మందికి ఇచ్చినట్లు వివరించారు. స్వచ్ఛ భారత్, ఉజ్వల యోజన పలు కేంద్ర ప్రభుత్వ పథకాలతో పేదలను ఆదుకున్నామని బండి సంజయ్ గుర్తు చేశారు.
"సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. అందులో భాగంగా తెలంగాణలో కూడా అమలు చేస్తున్నాం. ప్రజలకు, నాయకులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను వివరించడమే మహాజన్ సంపర్క్ అభియాన్ ఉద్దేశ్యం. పేదల కోసం ఇందిరా గాంధీ.. గరీబ్ హఠావో కార్యక్రమం తీసుకొచ్చారు. ఇందిరా గాంధీ ఆలోచన చాలా మంచింది. కానీ అందులో విజయం సాధించలేకపోయారు. ఇన్ని రోజులు దానిని అమలు చేయలేకపోయాం. రాష్ట్రంలో మూడు నాలుగు భారీ బహిరంగ సభలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. అందులో బీజేపీ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వస్తారు."- బండి సంజయ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
ఇవీ చదవండి: