ETV Bharat / state

బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్​ - BJP petition in HC on Bandi sanjay arrest

BJP petition in HC on Bandi sanjay arrest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్టును ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. సంజయ్ అరెస్టును వ్యతిరేకిస్తూ కమలం నేతలు హైకోర్టులో హౌస్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 5, 2023, 9:29 AM IST

Updated : Apr 5, 2023, 10:42 AM IST

BJP petition in HC on Bandi sanjay arrest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కరీంనగర్​ పోలీసులు అరెస్టు చేయడంతో రాష్ట్రంలో ఒక్క సారిగా రాజకీయ వేడి మొదలైంది. ఆయన అరెస్టును నిరసిస్తూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో హౌస్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు. మరోవైపు సంజయ్​ అరెస్టును రాష్ట్ర బీజేపీ పెద్దలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

కారణం చెప్పకుండా సంజయ్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి జి కిషన్​ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆరోపించారు. బండి సంజయ్‌ అరెస్టును ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. బీఆర్​ఎస్​ కాలం చెల్లిందని.. ప్రజలు త్వరలోనే ఆ పార్టీని ఇంటికి పంపిస్తారని జోస్యం చెప్పారు

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. బండి అరెస్టును బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. బీఆర్​ఎస్​ నాయకత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోశ్‌ అన్నారు. పాలన చేతగాక సంజయ్‌ను అరెస్టు చేశారని విమర్శించారు. బీఆర్​ఎస్​ మునిగిపోయే నావ అని పేర్కొన్నారు.

రఘునందన్​ అరెస్టు: మరోవైపు బండి సంజయ్​ను పరామర్శించేందుకు బొమ్మలరామారం పోలీసు స్టేషన్​ వద్దకు వెళ్లిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు తీవ్ర వాగ్వాదం జరగగా.. ఆయన్ను అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించడం లేదని ఆరోపించిన ఆయన.. రాష్ట్రంలో అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని ఆరోపించారు.

బండిసంజయ్​ను ఎందుకు అరెస్టు చేశారోచె ప్పకుండా.. నిర్భందించడం దారుణమని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిజాం లాంటి నియంతనే తెలంగాణ సమాజం ఎదిరించిందని.. కేసీఆర్​ పెద్ద లెక్క కాదని విమర్శించారు. పేపర్ లీకేజీలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారు. బండి సంజయ్​ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

ముందస్తు అరెస్టులు: బండి సంజయ్​ అరెస్ట్​ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కమలం పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఎక్కడిక్కడ పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బండి సంజయ్​ను పరామర్శించేందుకు బయల్దేరిన గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

కరీంనగర్​లో అర్ధరాత్రి హైడ్రామా.. ఉద్రిక్తతల నడుమ బండి సంజయ్ అరెస్టు

కమలాపూర్‌ పాఠశాల నుంచి హిందీ ప్రశ్నపత్రం బయటికొచ్చిందిలా: సీపీ

పది ప్రశ్నాపత్రాలు లీక్.. ముగ్గురు టీచర్లకు ఉద్వాసన

Last Updated : Apr 5, 2023, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.