ఇవీ చూడండి:బాలాపూర్ లడ్డూ ధర@17.60 లక్షలు
"బాలాపూర్ లడ్డూ దక్కించుకోవడం ఇది తొమ్మిదోసారి" - ramreddy
బాలాపూర్ గణపతి లడ్డూను వేలంపాటలో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కొలను రాంరెడ్డి. లడ్డూ కైవసం చేసుకోవటం ఇది 9వ సారి అని తెలిపారు.
BALAPUR _GANESH
మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంటే ఈసారి గణపతి దయ వల్ల బాలాపూర్ లడ్డూ తనకు దక్కిందని కొలను రాంరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. వేలంపాటలో గతేడాది కంటే లక్షల రూపాయలు ఎక్కువ ధర(రూ.17.60 లక్షలు) పెట్టి లడ్డూను కైవసం చేసుకున్నట్లు చెప్పారు. బాలాపూర్ గణపతి లడ్డూ దక్కించుకోవటం ఇది 9వ సారి అని పేర్కొన్నారు. పూజల అనంతరం లడ్డూను గ్రామస్థులకు పంచనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:బాలాపూర్ లడ్డూ ధర@17.60 లక్షలు