ETV Bharat / state

బాలానగర్ డివిజన్​లో బీజేపీ నేతలపై తిరగబడ్డ ప్రజలు

Balanagar Division People Blocked BJP Leaders: హైదరాబాద్ కూకట్​పల్లి బాలానగర్ డివిజన్​లో బస్తీలో పాదయాత్ర పేరుతో బీజేపీ నాయకులు పలు కాలనీల్లో పర్యటించారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలను తమ కాలనీలోకి రాకుండా ఇంద్రానగర్ కాలనీవాసులు తిరగబడ్డారు. ఓవైపు తమ గుడిసెలు కూల్చేయమని అధికారులను పంపిస్తూ.. మరోవైపు అండగా ఉంటామని మాయ మాటలు చెబుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Dec 5, 2022, 1:49 PM IST

Updated : Dec 5, 2022, 2:02 PM IST

Balanagar division people blocked BJP leaders

Balanagar Division People Blocked BJP Leaders: బస్తీలో పాదయాత్ర పేరుతో హైదరాబాద్ కూకట్​పల్లిలోని బాలానగర్ డివిజన్​లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీశ్ రెడ్డి పాదయాత్ర చేశారు. కూకట్​పల్లి నియోజకవర్గం ఇంఛార్జ్​ మాధవరం కాంతారావుతో కలిసి బస్తీలో పర్యటించారు. ఈ క్రమంలో వీరిపై స్థానిక ప్రజలు తిరగబడ్డారు. 40 ఏళ్లుగా ఐడీపీఎల్ బస్తీల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాము గుడిసెలు ఖాళీ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. తమను ఇళ్ల నుంచి తరిమేసేవాళ్లు తమ బస్తీలోకి రావొద్దంటూ అడ్డుకున్నారు.

దాదాపు 40 ఏళ్ల నుంచి బాలానగర్ డివిజన్​లోని ఇంద్రానగర్​లో 1200 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తమను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కానీ టీఆర్​ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు మద్దతుగా నిలిచారని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తమకు మౌలిక సదుపాయాలు కల్పించారని వెల్లడించారు. తమ గుడిసెలను అధికారులు తొలగించాలని చూస్తే టీఆర్ఎస్ సర్కార్ అండగా నిలిచిందని చెప్పారు.

తమ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ తమ గుడిసెలు కూల్చాలని ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గూడు చెదిరేలా చేసి అండగా ఉంటామని మాయమాటలు చెప్పడానికి వచ్చారా అంటూ బీజేపీ నాయకులపై మండిపడ్డారు. తమ కాలనీల్లోకి వారు రాకుండా తిరగబడ్డారు.

ఇవీ చదవండి: MLC Kavitha Letter to CBI : 'ఎఫ్​ఐఆర్​లో నా పేరు లేదు.. రేపు విచారణకు రాలేను'

'గుజరాత్​లో ఎన్నికల వేళ.. కాంగ్రెస్​ అభ్యర్థిపై హత్యాయత్నం!'

Last Updated : Dec 5, 2022, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.