ETV Bharat / state

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన బాలకృష్ణ - ఎన్టీఆర్​కు నివాలులర్పించిన బాలకృష్ణ

balakrishna
balakrishna
author img

By

Published : Jan 18, 2021, 8:55 AM IST

Updated : Jan 18, 2021, 9:34 AM IST

08:50 January 18

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన బాలకృష్ణ

ఎన్టీఆర్​ 25 వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్​ ఘాట్​ను పూలతో అలంకరించారు. ఘాట్​ను సందర్శించిన బాలకృష్ణ... తారక రాముడికి నివాళి అర్పించారు. దివంగత నేత సేవలను బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూల చాటిన తెలుగు వెలుగు నందమూరి తారక రామరావు అని అన్నారు. ఆయన జీవితం పెద్ద పాఠ్యాంశమని పేర్కొన్నారు. తనకు నిరుత్సాహం, నిర్లిప్తత ఉన్నప్పుడు ఎన్టీఆర్​ అనే మూడు అక్షరాలు తలుచుకుంటానని చెప్పారు.

ఎన్టీఆర్​ ఘాట్​కు నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్​ జోహార్, ఎన్టీఆర్​ అమర్​ రహై​ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్‌ ఘాట్​ వద్ద లక్ష్మీపార్వతి అంజలి ఘటించారు.  

రాష్ట్రవ్యాప్తంగా కూడా పలుచోట్ల వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖమ్మం ఎన్టీఆర్‌ కూడలిలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్​, ఎంపీ నామ నాగేశ్వరరావు నివాళి అర్పించారు.

ఇదీ చదవండి : రూపం మనోహరం.. అభినయం అనితర సాధ్యం!

Last Updated : Jan 18, 2021, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.