ఎన్టీఆర్ జయంతి (NTR BirthAniversary) సందర్భంగా పలువురు నివాళులు అర్పించారు. తెదేపా కార్యకర్తలతో కలిసి.. లాక్డౌన్ నిబంధనల మధ్య ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ (Hero Balakrishna)నివాళులు అర్పించారు. నాన్న సినిమాలు చూసి స్ఫూర్తి పొందుతానని వెల్లడించారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పాలిట పెన్నిధని బాలయ్య తెలిపారు. ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను గర్వపడేలా చేసి... ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని ఆయన తనయుడు రామకృష్ణ (Ramakrishna) పేర్కొన్నారు. ఏటా ఆయన జన్మదినం సందర్భంగా కుటుంబసమేతంగా ఘాట్ వద్ద నివాళులర్పిస్తామని... ఈ సారి కరోనా కారణంగా అక్కడికి వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. ఇంటి వద్ద నుంచే తండ్రి ఆశీర్వాదాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: NTR: ఆ పాత్రతో సాహసం చేసిన ఎన్టీరామారావు