Balakrishna on bheem: రోగులకు నాణ్యమైన, పారదర్శకతో కూడిన సేవలతో పాటు ఆసుపత్రి, వైద్యుల పూర్తి సమాచారం అందించేందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్స్టిట్యూట్ భీమ్ పేరుతో హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. గీతం డీమ్డ్ యూనివర్సిటీ సహాకారంతో రూపొందించిన భీమ్ సిస్టంను క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ ప్రారంభించారు.
రోగులకు నాణ్యమైన, పారదర్శకతతో కూడిన సేవలను అన్ని వర్గాలకు సమాన స్థాయిలో అందేలా చూడడంలో ఈ సాఫ్ట్వేర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ తెలిపారు. రోగులకు సంబంధించిన రికార్డులను వారి ఇంటి వద్ద నుంచే చూసుకునే వీలు కలిపించే విధంగా ఈ సాఫ్ట్‌వేర్‌లో రూపొందించినట్లు చెప్పారు. అత్యాధునిక సెక్యూరిటీ, ప్రైవసీ పరిరక్షణకు సంబంధించిన అంశాలను జోడించి రూపొందించడం జరిగిందన్నారు.
ఇది తొలి అడుగు మాత్రమేనని భవిష్యత్తులో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికపుడు అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని బాలకృష్ణ అన్నారు. క్యాన్సర్‌తో భాదపడుతున్న రోగులకు అందుబాటైన ధరలలో, ప్రపంచ స్థాయి నాణ్యమైన సేవలను అందించడంలో సంస్థ ఎప్పుడు ముందంజలో ఉంటోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు గీతం డీమ్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ట్రస్ట్ సభ్యులు భరత్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: