ETV Bharat / state

'కత్తి మహేశ్​పై భజ్​రంగ్ దళ్ కార్యకర్తల దాడి'

author img

By

Published : Feb 14, 2020, 7:31 PM IST

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్​లో భజరంగ్ దళ్ దాడికి యత్నించింది. ఖైరతాబాద్​లోని ఐమాక్స్ థియేటర్​లో చిత్రాన్ని వీక్షించి తిరిగి వెళ్తున్న క్రమంలో ముగ్గురు కార్యకర్తలు అతని కారును అడ్డగించారు.

కత్తి మహేశ్​పై దాడికి యత్నించిన ముగ్గురు నిందితులు అరెస్ట్

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్​పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేసేందుకు యత్నించారు. హైదరాబాద్ ఖైరతాబాద్​లోని ఐమాక్స్ థియేటర్​లో సినిమా వీక్షించి వెళ్తున్న సమయంలో... ఆయన కారును ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... దాడికి యత్నించారు.

ఆ ముగ్గురూ ఠాణాకు...

అక్కడే విధులు నిర్వహిస్తున్న సైఫాబాద్ పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. అనంతరం కత్తి మహేశ్​​ను అక్కడి నుంచి పంపించేసి... నిందితులను సైఫాబాద్ ఠాణాకు తరలించారు. దాడి చేసిన వారిని భజరంగ్ దళ్​కు చెందిన రాజ్ కుమార్, వెంకట్, సాయి రాజులను పోలీసులు గుర్తించారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కత్తి మహేశ్​​పై సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి : బీమా డబ్బు కోసం బాబాయ్​ హత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.