ఎమ్మెల్యేలకు ఎర కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచనం సృష్టింస్తుందో తెలిసిన విషయమే. తాజాగా ఈ కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు అయింది. ఏ1 రామచంద్ర భారతి, ఏ2 నందకుమార్‌కు బెయిల్‌ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. పూచీకత్తు సమర్పించడంతో బెయిల్ మంజూరు చేయగా.. రేపు చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు ఇద్దరు నిందితులు.
ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సింహయాజీ స్వామిజీకి సైతం ఇటీవల బెయిల్ పత్రాలు జారీ అయ్యాయి. సింహయాజీ తరఫు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో 6 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు జామీను సమర్పించారు. దీంతో కోర్టు బెయిల్ పత్రాలు మంజూరు చేసింది. స్వామీజీ తరఫు న్యాయవాది ఈ పత్రాలను చంచల్ గూడ జైలులో సమర్పించగా.. నేడు జైలు అధికారులు వాటిని పరిశీలించి.. ఆయనను విడుదల చేశారు.
సింహయాజీకి గతంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికి.. పూచీకత్తు, జామీను సమర్పించడంలో ఆలస్యమైనందున విడుదల కాలేకపోయారు. దీంతో ఆరో రోజులు తరువాత ఇద్దరి జామీను, 6 లక్షల పూచీకత్తుతో ఇవాళ విడుదల కానున్నారు. తాజాగా ఇదే కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాంచంద్ర భారతి, నందకుమార్‌లకు ఏసీబీ బెయిల్ మంజూరు చేసింది
ఇవీ చూడండి: