ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన ఓ మహిళ మొబైల్‌కు తన వ్యక్తిగత సమాచారంతో కూడిన చిత్రాలు, సంభాషణలు మెయిల్స్ రూపంలో వచ్చేవి. ఆశ్చర్యపోయిన మహిళ నగర సైబర్‌క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించింది. హ్యకింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరగాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన కాటూరి శైలేష్ ఈ సైబర్ నేరాలకు పాల్పడినట్లు నిర్ధరించారు. నిందితుడు బీటెక్ చదువు మధ్యలో ఆపేశాడు. వెబ్‌డెవలపింగ్, ఫిషింగ్, ఆండ్రాయిడ్ విభాగాల్లో పట్టు సాధించి హ్యకింగ్ చేస్తున్నాడు. గతంలోనూ ఓ మహిళను ఇలాగే బెదిరించాడని పోలీసులు పేర్కొన్నారు. ఎట్టకేలకు విశాఖలో హ్యకర్ అరెస్టయ్యాడని.. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
ఇవీ చదవండి....హ్యకర్లకు...దీటుగా మన సైబర్ పోలీసులు