ఎస్ఆర్ నగర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేదం కాలేజీలో బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేపట్టారు. కరోనా చికిత్స సమయంలో ఎక్కువగా స్టెరాయిడ్లు వాడుతున్న వారిలో బ్లాక్ ఫంగస్ వస్తుందని కళాశాల అదనపు ప్రిన్సిపల్ పెరుగు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయుర్వేద ఆయూష్ విభాగం ఆధ్వర్యంలో వ్యాధి నివారణ కొరకు ఉచిత మందులు ఇస్తున్నట్లు వెల్లడించారు.
వీటిని క్రమం తప్పకుండా వాడినట్లయితే బ్లాక్ ఫంగస్‌ను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. కొవిడ్ వచ్చిన వారిలో కూడా రాకుండా అరికట్టవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మందులను ప్రతిరోజు స్థానిక ఆయుర్వేద హాస్పిటల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఎఫ్‌డీలపై అధిక రాబడికి ప్రత్యేక పథకాలు!