Ram Mandir with chalk pieces: శ్రీరాముడిపై ఉన్న అభిమానంతో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాడు. అచ్చం రామమందిరాన్ని తలపించేలా వంద చాక్ పీసులతో రూపొందించాడు హైదరాబాద్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్. శ్రీరామనవమిని పురస్కరించుకుని మందిర నిర్మాణం చేపట్టినట్లు మైక్రో ఆర్టిస్ సంపత్ వివరించాడు. జియాగూడకు చెందిన సంపత్(19) కేవలం పదిరోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపాడు.
శ్రీరాముడిపై భక్తితో ఈ విధంగా అయోధ్య రామమందిరాన్ని నిర్మించానని వెల్లడించాడు. దాదాపు 8.2 సెంటీమీటర్లు ఎత్తు, 16 సెంటీమీటర్ల వెడల్పుతో మందిరాన్ని రూపొందించినట్లు సంపత్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం