కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు నిత్యం ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు వినూత్నంగా ఆలోచించారు నగరానికి చెందిన సాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్. సృజనాత్మక పద్ధతిలో చెబితే ప్రజలకు మరింత చేరువవుతుందని భావించిన ఆయన.. కరోనా కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సాండ్ ఆర్ట్‌తో తెలియజేశారు.
అందమైన బొమ్మల రూపంలో చేసిన ఈ సాండ్ ఆర్ట్ ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఆకర్షితులైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్.. ఈ దృశ్యాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు.