ETV Bharat / state

భద్రాద్రి, జక్రాన్​పల్లి, మహబూబ్​నగర్​లో విమానాశ్రయాలు - హైదరాబాద్​లో వింగ్స్ ఇండియా 2020

హైదరాబాద్ బేగంపేటలో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన కనువిందు చేస్తోంది. రెండో రోజు జరిగిన 'వింగ్స్‌ ఇండియా- 2020' మంత్రి కేటీఆర్​తో పాటు... పలువురు పౌరవిమానయాన శాఖ అధికారులు, సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా... పలు సంస్థలు అవగాహన ఒప్పందాలు, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించాయి.

Aviation second day continues in Hyderabad
కనువిందు చేసిన వింగ్స్ ఇండియా
author img

By

Published : Mar 14, 2020, 6:02 AM IST

Updated : Mar 14, 2020, 9:41 AM IST

కనువిందు చేసిన వింగ్స్ ఇండియా

ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనగా పేరొందిన బేగంపేట వైమానిక ప్రదర్శన అట్టహాసంగా సాగుతోంది. కరోనాతో కమ్ముకున్న అపోహలను పటాపంచలు చేస్తూ... పౌర విమాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. దేశవిదేశాల నుంచి ప్రతినిధులు ఇందులో భాగస్వాములవుతున్నారు. గగనతలంలో అబ్బురపరిచేలా విమానాల ప్రదర్శన సాగుతోంది.

నీలినీడలను అధిగమించి..

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా భయంతో... ఏవియేషన్ ప్రదర్శనపై కమ్ముకున్న నీలినీడలను అధిగమించిన 'వింగ్స్ ఇండియా - 2020' ప్రదర్శన నిర్వాహకులను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఏవియేషన్‌ ప్రదర్శనలో భాగంగా రెండో రోజు జరిగిన సదస్సులో ఆయనతో పాటు.... పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఇండియా ఛైర్మన్ అరవింద్ సింగ్, పౌరవిమానయానశాఖ జాయింట్ కార్యదర్శి ఉషాపధి, ఫిక్కీ ఛైర్మన్ ఆనంద్ స్టాన్లీ, ఫిక్కీ ప్రెసిండెంట్ సంగీతారెడ్డి పాల్గొన్నారు.

ప్రపంచ స్థాయి ఏరో స్పేస్ విశ్వవిద్యాలయం..

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఏరో స్పేస్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవియేషన్ రంగ అభివృద్ధి.. దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని పౌరవిమాన శాఖ జాయింట్ కార్యదర్శి ఉషా పధీ పేర్కొన్నారు.

కొత్తగా మూడు చోట్ల విమానాశ్రయాలు..

రాష్ట్రంలో కొత్తగా మూడు చోట్ల విమానాశ్రయాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్​లోని జక్రాన్​పల్లి, మహబూబ్​నగర్ పేర్లను ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు. పాత ఎయిర్​పోర్టులను పునర్వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

అవగాహన ఒప్పందాలు..

రెండో రోజు వైమానిక ప్రదర్శనలో భాగంగా... హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. మరోవైపు బిజినెస్ మీటింగ్స్​లో భాగంగా... బోయింగ్ కంపెనీ భారత్‌లో తమ కార్యాచరణను ప్రకటించింది. ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఎక్స్ పోలో రాష్ట్రానికి చెందిన టీవర్క్స్ స్టాల్ డ్రోన్ టెక్నాలజీ, ప్రోటో టైప్ త్రీడీ ప్రింటింగ్ నమూనాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చదవండి: కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Last Updated : Mar 14, 2020, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.