సమాజానికి మహిళలు ఎంత ముఖ్యమో... వారి రక్షణకు యువకులు అమ్మాయిలతో ఎలా మెలగాలి? ఎలా ఉండాలి? వారిని ఏ విధంగా ఆదరించాలి? అనే భావనతో... "రీడ్ అండ్ బర్న్" పుస్తకాన్ని ఆంగ్ల భాషలో రచించానని " సాయి వివేక్ రావు వెల్లడించారు.
ప్రపంచీకరణ, పాశ్చాత్య పోకడల వలన యువత పెడదారి పడుతుందని... దీని వలన చిన్నారులు, బాలికలపై రోజు రోజూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. మహిళలపై దాడులు జరగడానికి ప్రధాన కారణం కేవలం ఉన్మాదం అనే విషయాన్ని ప్రజలు మరచిపోతున్నారని గుర్తు చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకువచ్చినప్పటికీ... యువకులలో మార్పు రావాలని యువతలోనూ మానసిక పరిపక్వత కల్పించాల్సిన అవసరముందని అయన అన్నారు. ఈ పుస్తకం "రీడ్ అండ్ బర్న్" రాయడానికి ప్రధాన ఉద్దేశం సమాజంలో మహిళలపట్ల గౌరవభావాన్ని పెంపొందించడం, భద్రత, యువతలో రావాల్సిన మార్పు కోసమే అని తెలిపారు. ఈ పుస్తకాన్ని వచ్చే నెల ప్రముఖుల చేతులమీదుగా ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నానని సాయి వివేక్ రావు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా రోగుల రక్తాన్ని తాగుతున్న కార్పొరేట్ ఆస్పత్రులు!