ఏపీ విశాఖపట్నం గాయత్రి విద్య పరిషత్ చెందిన సంచాలకులు రావు తటవర్తి తన విద్యార్థి బృందంతో కలిసి ఈ పరికరాన్ని రూపొందించారు. ఎయిర్ యూనిక్ క్వాలిటీ మానిటరింగ్ గా దీనిని వ్యవహరిస్తారు. గాలిలో కాలుష్య కారకాలు, సెకండ్ల వ్యవధిలోనే ఎన్ని ఉన్నాయి అన్న విషయాన్ని ఈ పరికరం లెక్క పెడుతుంది.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ అంశంపై స్పందించారు. ఆ పరికరాన్ని, రూపొందించిన రావు సేవలను, వినియోగించు కుంటామని.. తగిన ప్రోత్సాహకం ఇవ్వాలని తెలిపారు. చూడడానికి సీసీ కెమెరా పరిమాణంలో వుండే ఈ పరికరం 360 డిగ్రీలలో తిరుగుతుంది.
దీనివల్ల గాల్లో తేమను ఆవిరిని గుర్తించే అవకాశం ఉంది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన.. ఈ తరహాలో పరికరం ఉంటే అందులో ఏ మేరకు కాలుష్య కారకాలు ఉన్నాయి, విష పదార్థాలను కూడా ఈ పరికరం విశ్లేషణ చేసి వెంటనే సంబంధిత వ్యక్తులను అలెర్ట్ చేస్తుంది.