ETV Bharat / state

కోర్టు ఉత్తర్వులను ఎలా అమలు చేయకూడదో శిక్షణ పొందుతున్నారా?

ధర్మాసనం ఉత్తర్వులను అమలు చేయొద్దని.... ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్​కు అనధికారిక ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అని ఆ రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. శిక్షణలో భాగంగా ముస్సోరి వెళ్లి ఏమి నేర్చుకుంటున్నారని ప్రశ్నించింది . కోర్టు ఉత్తర్వులను ఎలా అమలు చేయకూడదో నేర్చుకుంటున్నారా అని అసహనం వ్యక్తంచేసింది . రాష్ట్రంలోని 90 శాతం మంది అధికారులు..... చట్టాలకు అతీతులం అనుకుంటున్నారన్నారని పేర్కొంది.

కోర్టు ఉత్తర్వులను ఎలా అమలు చేయకూడదో శిక్షణ పొందుతున్నారా?
కోర్టు ఉత్తర్వులను ఎలా అమలు చేయకూడదో శిక్షణ పొందుతున్నారా?
author img

By

Published : Jan 28, 2021, 5:32 AM IST

కనీస టైం స్కేల్ అమలుకు కోర్టు ఆదేశించినా.... అధికారులు పట్టించుకోలేదని రాజమహేంద్రవరం ఎస్కేఆర్ కళాశాల అటెండర్ పాపారావు వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. వ్యాజ్య ఉపసంహరణకు.... కళాశాల కరస్పాండెంట్ రామ్మోహనరావు ఒత్తిడి చేస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆగ్రహించిన ధర్మాసనం.... చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి..... ఉపసంహరణకు ఒత్తిడి చేస్తారా అని ప్రశ్నించింది.

ఓ అటెండర్‌కు కనీస టైం స్కేల్ అమలు చేయాలని ఇచ్చిన ఆదేశాల్ని మూడేళ్ల పాటు అమలు చేయకపోవడం సరికాదని ఆగ్రహించింది. అటెండర్ చిరుద్యోగి కాబట్టి పట్టించుకోవడం లేదా అని నిలదీసింది. రాజ్యాంగం అందరికీ ఒకే హక్కులను ప్రసాదించిందని గుర్తు పెట్టుకోవాలంది. కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలున్నా రాకుండా... హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అనుబంధ వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. దేవదాయశాఖ కమిషనర్ అర్జున్ రావు, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్‌ ఎమ్ఎమ్ నాయక్, కళాశాల విద్య రాజమహేంద్రవరం ఆర్జీడీ డేవిడ్ కుమార్‌పై తొలుత నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరపర్చాలని ఆదేశించింది. మధ్యాహ్నం వారు హాజరవుతారని.... ఎన్​బీడబ్ల్యూ వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది కోరటంతో.... విచారణను కొద్దిసేపు వాయిదా వేసింది.

మధ్యాహ్న విచారణకు అర్జున్‌రావు, ఎమ్ఎమ్ నాయక్‌, ఎస్కేఆర్ కళాశాల కరస్పాండెంట్‌ రామ్మోహనరావు హాజరై వివరణ ఇచ్చారు. దీంతో అంతకముందు ఇచ్చిన ఎన్​బీడబ్ల్యూ ఉత్తర్వులను కోర్టు వెనక్కి తీసుకుంది. కోర్టుకు హాజరవకపోవటంతో..... డేవిడ్‌ కుమార్‌పై నాన్‌ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని రాజమహేంద్రవరం పట్టణ ఎస్పీని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇస్తూ ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 15 కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: పీఆర్సీ నివేదికపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.