ETV Bharat / state

Bhatti: 'రాష్ట్రంలో దళితులకు బతికే హక్కే లేదా?' - bhatti on under communities

అణగారిన వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) పట్టించుకోవడం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయా వర్గాల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Attacks
భట్టి విక్రమార్క
author img

By

Published : Jun 22, 2021, 7:21 PM IST

సీఎం కేసీఆర్ (Cm Kcr) నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, గిరిజనులు, పేదవాళ్లపై ఏడేళ్ల నుంచి అనేక అకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు సీఎల్పీ భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). కేవలం రూ. 2 లక్షల దొంగతనం ఆరోపణలతో మరియమ్మ అనే మహిళను అన్యాయంగా, కిరాతకంగా కొట్టి చంపారని ఆవేదన వెలిబుచ్చారు. హత్యాకాండ జరుగుతున్న ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు.

సీఎం కేసీఆర్ పాలన చూస్తుంటే రాష్ట్రంలో ఎస్సీఎస్టీ, గిరిజనుల ప్రాణాలకు విలువే లేదనిపిస్తోందన్నారు. మరియమ్మ లాకప్​లో చనిపోయి మూడు రోజులైనా... ఇప్పటి వరకు అట్రాసిటీ కేసు పెట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పేద కుటుంబాల ప్రజల ప్రాణాలు, వారి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబడతామని భరోసానిచ్చారు. న్యాయం కోసం ఎందాకైనా వెళతామని పేర్కొన్నారు.

త్వరలోనే మానవహక్కుల కమిషన్​ను కలుస్తామని భట్టి (Bhatti Vikramarka) అన్నారు. గవర్నర్ తమిళిసైకి లేఖ రాసినట్లు వెల్లడించారు. వారైనా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనలు, పేదలకు జరుగుతున్న ఆకృత్యాలు అనేకం జరుగుతునే ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్న ఈ రాష్ట్రంలో దళితులకు బతికే హక్కే లేదా? వారి ప్రాణానికి విలువే లేదా? కేవలం రెండు లక్షల రూపాయలు దొంగతనం జరిగిందనే ఆరోపణపై మరియమ్మను అతికిరాతకంగా హింసిస్తే పోలీస్​స్టేషన్​లోనే మరణించింది. హత్యాకాండ జరుగుతున్న సీఎం స్పందించకపోవడం దారుణం. రాష్ట్రంలో దళితులు మనుషుల్లాగా కనిపించడం లేదా?

-- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ముఖ్యమంత్రి కేసీఆర్​పై భట్టి విక్రమార్క విమర్శలు

ఇదీ చూడండి: Cm Kcr On Professor: వాసాలమర్రిలో బంగ్లాదేశ్​ ప్రొఫెసర్ ప్రస్తావన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.