ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు తెదేపా నాయకులను పోలీసులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే తన స్టేట్‌మెంట్‌ను లిఖితపూర్వకంగా నమోదు చేసుకున్నారని.. స్టేషన్‌కు రావాల్సిన అవసరమేంటని కొల్లు రవీంద్ర.. పోలీసులను ప్రశ్నించారు.
పోలీసులు అనుసరిస్తున్న విధానం సరికాదని రవీంద్ర అన్నారు. ఏ మాత్రం సంబంధం లేని విషయంలో తనను ప్రశ్నించేందుకు స్టేషన్‌కు రమ్మనే విషయంలో పునరాలోచన చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు, అనుచరులు రవీంద్ర ఇంటికి భారీగా చేరుకున్నారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీ పార్థసారథి రాజీనామాకు బండి సంజయ్ డిమాండ్