ఓ ఏటీఎంలో నమోదు చేసినంత కాకుండా.. తక్కువ నగదు వస్తుండటంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. అమీర్‌పేట బీకేగూడ నెహ్రూనగర్ కూడలిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం నుంచి ఆదివారం సాయంత్రం రూ.10 వేలు నమోదు చేస్తే రూ.4 వేలు, రూ.5 వేలకు రూ.2 వేలు వస్తుండటంతో వినియోగదారులు అవాక్కయ్యారు.
నమోదు చేసిన మొత్తం విత్‌డ్రా అయినట్లు సందేశాలు రాగా కంగారుపడ్డారు. 30 మందికి పైగా ఖాతాదారులు ఈ సమస్యను ఎదుర్కొని, ఎస్సార్‌నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఏటీఎం వచ్చి పనిచేయడం లేదని బోర్డు పెట్టారు. సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగి ఉండొచ్చవని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: కేసులు తక్కువే అయినా.. వేటికవే ప్రత్యేకంణ