ETV Bharat / state

రూ.500 కొడితే రూ.2500.. ఏటీఎం కేంద్రానికి ఎగబడ్డ జనం..! - ఏటీఎంలో సాంకేతిక సమస్య

ATM Cash Issue: ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తుండగా రూ.500 డ్రా చేస్తే రూ.2500 వచ్చాయి. ఎన్నిసార్లు చేసినా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇలా ఉచితంగా డబ్బులు వస్తే ఎవరు కాదనుకుంటారు? అందుకే ఒక్కసారిగా డబ్బులు రావడంతో ఆ ఏటీఎం వద్ద జనాలు బారులు తీరారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందంటే..?

Atm
Atm
author img

By

Published : Jan 4, 2023, 9:10 AM IST

ATM Cash Issue: పాతబస్తీలోని ఓ ఏటీఎంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 రావడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఈ సంఘటన మొఘల్‌పురా పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి శాలిబండకు చెందిన ఓ వ్యక్తి హరిబౌలి చౌరస్తాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన ఏటీఎంకు వెళ్లి రూ.500 డ్రా చేసేందుకు యత్నించగా మిషన్‌ నుంచి రూ.2500 బయటకు వచ్చాయి.

దీంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే విషయం తెలుసుకున్న స్థానికులు ఏటీఎం వద్ద గుమిగూడారు. ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ ఏటీఎం కేంద్రానికి చేరుకుని పరీక్షించగా రూ.500 డ్రా చేస్తే రూ.2500 వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఏటీఎం కేంద్రాన్ని మూసి వేయించి, బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. సాంకేతిక కారణాలతోనే ఇలా వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.