ETV Bharat / state

రెస్టారెంట్లు, పబ్బుల్లో ఏటీఎం కార్డులిస్తే దోచేస్తారు! - Atm Card Cloning

ఏటీఎం కార్డులను క్లోనింగ్‌ చేస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒడిశాకు చెందిన ముగ్గురు సభ్యుల ముఠా నకిలీ కార్డులు తయారు చేసి రూ.13లక్షలు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు.

క్లోనింగ్ చేస్తోన్న ముఠా అరెస్ట్
క్లోనింగ్ చేస్తోన్న ముఠా అరెస్ట్
author img

By

Published : Mar 17, 2020, 7:53 PM IST

క్లోనింగ్ చేస్తోన్న ముఠా అరెస్ట్

హైదరాబాద్​లోని పలు రెస్టారెంట్లు, పబ్బుల్లో పనిచేస్తూ ఏటీఎం కార్డులను క్లోనింగ్‌ చేసి నగదు చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రూ.10లక్షల నగదు, ఆరు మొబైల్‌ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, క్లోనింగ్‌ యంత్రాలు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని వివరించారు. ఇప్పటి వరకు 140 ఏటీఎం కార్డులను నిందితులు క్లోనింగ్‌ చేసినట్లు గుర్తించామన్నారు.

ఈ ముఠాలోని ప్రధాని నిందితుడు ప్రఫుల్‌ కుమార్‌ ఆన్‌లైన్‌లో స్కిమర్‌, క్లోనింగ్‌ మిషన్‌ కొనుగోలు చేశాడని చెప్పారు. ఉన్నత స్థాయి రెస్టారెంట్లు, పబ్బుల్లో నిందితులు వెయిటర్లుగా చేరారని.. వినియోగదారులు బిల్లు చెల్లించే సమయంలో తమ వెంట తెచ్చుకున్న స్కిమర్‌ సహాయంతో కార్డులోని డేటాను తస్కరించి తద్వారా నగదును దొంగిలించారని ఆమె వివరించారు.

ఇవీ చూడండి : ముగ్గురు పిల్లలపై సవతితల్లి అరాచకత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.