కొవిడ్ వ్యాక్సిన్ వచ్చాక ప్రజలకు ఊరట లభిస్తోందని శాసనసభ ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఐదు వాక్సిన్ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. సీతాఫల్‌మండీ, ఉప్పరి బస్తీ ప్రభుత్వ పాఠశాలలు, మహమ్మద్ గూడ రెడ్ క్రాస్ ఆస్పత్రి, లాలాపేట, అడ్డగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
త్వరలోనే ప్రజలందరికీ టీకా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమారి సామల హేమ, లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, వైద్యాధికారులు డాక్టర్ సక్కుబాయి, డాక్టర్ రవీందర్ గౌడ్, వైద్యులు సుధ, రమేష్, మాధురి, ఎమ్మార్వో సునీల్ కుమార్, అధికారులు, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ పాల్గొన్నారు.