సమాజంలో అనునిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న అనేక రకాల సిబ్బందిని ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ, పారిశుద్ధ్య, మలేరియా సిబ్బందిని ఆదుకోవాలని ఏఐటీయూసీ కార్యదర్శి అంజిరెడ్డి సూచించారు.
ఈ తరుణంలో హైదరాబాద్ ముషీరాబాద్ బాకారంలోని ఓ అపార్ట్మెంట్ వాసులు ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని వారికి అందజేశారు. ఆయా సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ అభినందించాలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అందరూ పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: భారత్కు ఏడీబీ 220 కోట్ల డాలర్ల సాయం