హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గోషామహల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచే కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ... పాతబస్తీకి చేసిన అభివృద్ధిని వివరించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ఇవీ చూడండి:నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు