కొన్ని శక్తులు దేశాన్ని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నాయని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవుల ప్రేయర్ డే సభలో పాల్గొన్నారు. క్రైస్తవుల డిమాండ్ల పరిష్కారానికి అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానని హామీ ఇచ్చారు.
దేశంలో నిజమైన సెక్యూలర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ (సీసీటీ) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్నారు. ‘దేశం, రాష్ట్రం, పాలకులు, ప్రజలంతా సుఖంగా, సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు.