ETV Bharat / state

మా ఇంటిపై 50 మంది టీఆర్​ఎస్ కార్యకర్తలు దాడి చేశారు: ధర్మపురి విజయలక్ష్మి - బంజారాహిల్స్‌లో అర్వింద్ ఇంటిపై దాడి

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిపై ఆయన తల్లి ధర్మపురి విజయలక్ష్మి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె తరపున పర్సనల్‌ అడ్వకేట్లు, మేనేజర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

Arvind house attack mother complaint
ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడి
author img

By

Published : Nov 18, 2022, 9:58 PM IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసంపై దాడి ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై అర్వింద్‌ తల్లి డి. విజయలక్ష్మీ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరపున పర్సనల్‌ అడ్వకేట్లు, మేనేజర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఉదయం 11.30 గంటలకు 50 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాన గేటు పగులగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్‌ఎస్‌ జెండాలు, కర్రలతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు.

ఈ దాడిలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్‌ రమణ గాయపడ్డారన్నారు. బెంజ్‌కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. దాడికి పాల్పడిన 50 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌కి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్‌ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన ఉన్నారు. హైదరాబాద్‌లో తెరాస కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.