ETV Bharat / state

తండ్రి బాటలో చిత్రకారిణిగా రాణిస్తున్న ప్రియాంక ఏలే - ఔరా అనిపించేలా పెయిటింగ్స్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 4:06 PM IST

Artist Laxman Aelay Daughter Priyanka Aelay Interview : ఊహలకు రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తే? మనసులో మెదిలే ఆలోచనలు రంగులద్దుకొని కాన్వాస్‌పై ఆవిష్కృతమైతే ఎలా ఉండొచ్చు? అవి ప్రియాంక ఏలె సృష్టించిన అద్భుత చిత్రాలు అయ్యి ఉండొచ్చనేలా ప్రతిభ కనబరుస్తుందా యువతి. మనసులో మెదిలే ఆలోచనలకు కొంగొత్త వర్ణాలద్దుతోంది. ఊహల కాన్వాస్‌పై కన్న కలలకు రంగుల రెక్కలిస్తోంది. చేయాలన్న తపన ఉంటే చుట్టూ ఉండే ప్రకృతే, అద్భుతమైన స్ఫూర్తిని ఇస్తుందంటోన్న ఆ యువ కళాకారిణి ప్రియాంక ఏలె కథ ఇది.

Priyanka aelay about Painting
Artist Laxman Aelay Daughter Priyanka Aelay Interview
తండ్రి బాటలో చిత్రకారిణిగా రాణిస్తున్న ప్రియాంక ఏలే - ఔరా అనిపించేలా యువతి పెయిటింగ్స్​

Artist Laxman Aelay Daughter Priyanka Aelay Interview : కుంచెతో అద్భుతాలు సృష్టిస్తూ కన్నుల్లోనే కళలను నింపుకుని, కాన్వాస్‌పై కలలకు రూపం ఇస్తున్న ఈ యువతి బాల్యం రంగుల మయం. తండ్రి చాటు చిన్నారిగా ఆయన వేసిన బొమ్మల్లో తన రూపాన్ని చూసుకుంది. ఇప్పుడు మనసులో మెదిలే తన ఆలోచనలను కాన్వాస్‌పై అద్భుత చిత్రాలుగా ఆవిష్కృతం చేస్తుంది. ఔరా అనిపించే ప్రతిభతో ప్రముఖలచేత ప్రశంసలు, మన్ననలు అందుకుంటుంది ఈ యువ చిత్రకారిణి.

ఈ యువతి పేరు ప్రియాంక ఏలె. యాదాద్రి జిల్లా కదిరేనిగూడెం స్వస్థలం. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే(Laxman Aelay) కుమార్తె ఈ ప్రియాంక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను తయారు చేసి, అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించారు లక్ష్మణ్ ఏలే. అయితే వాస్తవానికి ఆయనో గొప్ప చిత్రకారుడు. అక్కతో కలిసి చిన్నప్పటి నుంచి తండ్రి వేస్తున్న రంగుల చిత్తరువులను చూస్తూ పెరిగింది ప్రియాంక.

Nalgonda Animation artist Raghavendra : చిత్రలేఖనానికి టెక్నాలజీ జోడించాడు.. ఏడాదికి రూ.27 లక్షలు గడిస్తున్నాడు

Priyanka Aelay about Paintings : తెలంగాణ ప్రజల సంస్కృతిని, వారి జీవనాన్ని ప్రతిభింబించేలా తండ్రి వేసిన పెయింటింగ్ లను చూసి స్ఫూర్తి పొందింది ప్రియాంక. తొలినాళ్లలో ఆయిల్, పేస్టల్స్, పెన్ అండ్ ఇంక్‌తో ప్రయోగాలు చేసి, ఇప్పుడు యాక్రిలిక్స్‌తో అద్భుతాలు సృష్టిస్తుంది. తన పెయిటింగ్స్‌లో పర్యావరణం, జంతువులు, మొక్కలనే ఎక్కువగా చూపించే ప్రియాంక, ఇందుకు పురాణాలు, ఇతి హాసాల నుంచి స్ఫూర్తి పొందుతానని చెబుతోంది.

పల్లె సంస్కృతినీ, ప్రకృతి అందాలనూ చూపించేందుకు ఎలాంటి నిబంధనలు ఉండకూడదని తండ్రి చెప్పిన మాటలే ఆదర్శంగా తీసుకుంది ప్రియాంక. అయితే మనసులోని భావాలకు కుంచెతో దృశ్యరూపం ఇవ్వడం అంత సులభమేమీ కాదు. వాస్తవికత, భావుకతల మధ్య ఆహ్లాదకరమైన అనుభూతి ఉంటుంది. దీన్ని దృశ్యరూపంగా మలచడం ఎంతో క్లిష్టమైన పని. సవాల్‌గా తీసుకుని దాని అందిపుచ్చుకోవాలనుకుంది ఈ కళాకారిణి.

'ఊహ తెలిసిన నాటి నుంచే రంగుల మధ్య పెరిగాను. నాన్న ప్రోత్సాహంతో హైదరాబాద్ జేఎన్‌ఏఎఫ్‌యూలో ఆర్ట్స్‌లో డిగ్రీ, సెంట్రల్ వర్సిటీలో పీజీ పూర్తి చేశా. పెయింటింగ్‌తో పాటు థియేటర్ ఆర్ట్స్‌లో పీహెచ్​డీ అందుకున్న. ఈ క్రమంలోనే సురభి, యక్షగానం గురించి అధ్యయనం చేసి ఆ కళాకారుల సంస్కృతిపై దృష్టి పెట్టా'. -ప్రియాంక ఏలె , చిత్రకారిణి

Artist Aelay Priyanka about her Paintings : యాక్రిలిక్స్‌తో(Acrylics) అందమైన చిత్రాలకు ప్రాణం పోయటం ప్రియాంకకు అలవాటు. అలా ఇప్పటి వరకు దేశ విదేశాల్లో 8 సోలో, 150కి పైగా గ్రూప్ ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపించుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫౌండేషన్ ద్వారా ఫ్రాన్స్‌లోని (France)బోర్డెక్స్‌లో ఆరు వారాల పాటు ఉండి చిత్రలేఖనం చేసింది. యూరోపియన్, భారత సంస్కృతికి దగ్గర ఉండేలా గీసిన బొమ్మలు అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలిండియా పెయింటింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని అందుకుంది ప్రియాంక.

తండ్రి కళకు వారసురాలిగా చిత్రలేఖనాన్ని ఎంచుకున్నా తనకంటూ ప్రత్యేక శైలిని అందిపుచ్చుకుని మెప్పిస్తోంది ప్రియాంక. ఎఫ్​ఎన్​ సూజా, ఫ్రిదా కాలో వంటి కళాకారుల కళలను అమితంగా ఇష్టపడతుంది. రోజూ మెడిటేషన్ చేసినట్టే బొమ్మలు గీస్తా అంటోంది. ఈ రంగంలో రాణించాలంటే పట్టుదలతో పాటు కళల గురించి తెలుసుకోవటం, రీసెర్చ్ చేయటం, చుట్టూ పరిస్థితులను ఎక్కువగా గమనించటం ముఖ్యమని చెబుతోంది.

Maruthi Daughter Art Gallery : 8 నెలల్లో 71 కామిక్​ చిత్రాలు.. చూస్తే వావ్​ అనాల్సిందే!

Actress Shamlee Paintings : కుంచె పట్టిన 'ఓయ్'​ హీరోయిన్​.. తన నెక్స్ట్​ టార్గెట్​ ఏంటంటే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.