ETV Bharat / state

తొమ్మిదో తరగతి నుంచే కృత్రిమ మేధ

సీబీఎస్​ఈలో గణితశాస్త్రాన్ని ఆప్షనల్​ సబ్జెక్టుగా ఈ ఏడాది నుంచే చేర్చనున్నారు. పదో తరగతి గణితంలోనూ రెండు రకాల ప్రశ్నా పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి. పదోతరగతి తర్వాత గణితం లేని సబ్జెక్టు చదువుకోవాలనుకునే వారికి ఇదో శుభవార్త అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు కొందరు విద్యార్థులు.

తొమ్మిదో తరగతి నుంచే కృత్రిమ మేధ
author img

By

Published : Aug 26, 2019, 8:01 AM IST

Updated : Aug 26, 2019, 5:23 PM IST

మారుతున్న సాంకేతికత పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి నుంచే కేంద్ర మాధ్యమిక మండలి (సీబీఎస్​ఈ) కృత్రిమ మేధను ఐచ్ఛిక సబ్జెక్టు​గా అమలు చేస్తోంది. యోగా, శిశు విద్య అంశాలను కూడా ఐచ్ఛికాలుగా ప్రవేశపెట్టాలని గత మార్చిలో బోర్డు నిర్ణయించింది. తొమ్మిదో తరగతిలో ఎంచుకున్న ఐచ్ఛికాన్నే పదో తరగతిలోనూ ఎంచుకోవాల్సి ఉంటుంది. తప్పని సరి సబ్జెక్టులు ఐదు ఉండగా... ఆరో సబ్జెక్టుగా ఒక ఐచ్ఛిక సబ్జెక్టును తీసుకుంటారు. గణితం అంటే భయపడేవారికి ఊరటనిస్తూ ఈ విద్యా సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో రెండు రకాల గణితం ప్రశ్నాపత్రాలు రూపొందించనున్నారు.

తొమ్మిదో తరగతి నుంచే కృత్రిమ మేధ

పదో తరగతి తర్వాత గణితం లేని సబ్జెక్ట్ చదువుకోవాలని అనుకున్నవారు సులభంగా ఉండే ప్రశ్నా పత్రాన్ని ఎంచుకోవచ్చు. పదో తరగతి గణితం సిలబస్ అందరికీ ఒక్కటే. తరగతి గదిలో ఒకేలా బోధిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న దాన్ని బట్టి ప్రశ్న పత్రాన్ని ఇస్తారు.

ఇవీ చూడండి : వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

TG_HYD_06_26_SHE_TEAMS_POKIRILU_HIGH_IN_PRIVATE_ORGANISATIONS_PKG_3038066 Reporter: Tirupal Reddy Dry ()తెలంగాణ రాష్ట్రంలో అతివలను వేధిస్తున్న పోకిరీల్లో ఉద్యోగులే అధికంగా ఉన్నట్లు షీ బృందాలు తేల్చాయి. అతివ కనిపిస్తే చాలు...వెకిలి చేష్టలు..వెర్రి వేషాలతో చెలరేగిపోతున్నారు. సూటిపోటి మాటలతో తూటాల్లో పేలుతూ అదుపు తప్పుతున్నారు. సహచర ఉద్యోగులే పోకిరీల అవతారమెత్తుతూ పని చేసే చోట తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. LOOK వాయిస్ఓవర్‌1: మహిళలు, యువతలను వేధిస్తున్న పోకిరీల పని పట్టేందుకు ఏర్పాటు చేసిన షీ బృందాలు పనితీరు దేశంలోనే మార్గదర్శకంగా నిలుస్తోంది. పోకిరీల పని పట్టడంలో...వేధింపులకు గురవుతున్న అతివలకు అండగా నిలువడంలో ముందుంటున్నాయి. పనీబాట లేని పోకిరీలే మహిళలను, అమ్మాయిలను సూటిపోటి మాటలతో వేధిస్తున్న వారికంటే సహచర ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో షీ బృందాలకు పట్టుబడిన వారి వృత్తిని పరిగణనలోకి తీసుకుని పరిశీలన చేస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులే మూడొంతులు ఉన్నట్లు షీ బృందాల పరిశీలనలో తేలడంతో అధికారులు అవాక్కయ్యారు. షీ బృందాలకు పట్టుబడిన ప్రతి వంద మందిలో 77శాతం ప్రయివేటు ఉద్యోగులు, కూలీలు 5శాతం, ప్రభుత్వ ఉద్యోగులు 3శాతం, డ్రైవర్లు 6శాతం, వైద్యులు 2శాతం, వ్యాపారులు 14శాతం లెక్కన ఉన్నట్లు తేలింది. 77శాతం ప్రయివేటు ఉద్యోగుల్లో ఎక్కువగా సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఇతర ఇతర ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వృత్తులు వారీగా లెక్కలు తీస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇలాంటివి తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఏయే సంస్థల్లో ఎక్కువగా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారో...లెక్కలు తీస్తున్న అధికారులు ఆయా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నియంత్రణలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ప్రయివేటు కార్యాలయాల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి...ఆయా సంస్థలకు అనుకూలమైన సమయాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. పెద్ద ఎత్తున సామాజిక మాద్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని, తప్పు చేసిన తరువాత పట్టుకునే కన్నా...ఆ తప్పు జరగకుండా ముందుస్తుగా చైతన్యం తీసుకురావడం ద్వారా ఆయా కార్యాలయాల్లో ఉద్యోగులు మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
Last Updated : Aug 26, 2019, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.