ETV Bharat / state

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్టు - హైదరాబాద్​

జంటనగరాల్లో గొలుసు దొందతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పశ్చిమ మండలం టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్టు
author img

By

Published : Nov 5, 2019, 12:00 AM IST

హైదరాబాద్​ జంటనగరాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితులను పశ్చిమ మండలం టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 5.60 లక్షల నగదు, 14.4 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హబీబ్​నగర్​ మంగర్​బస్తీకి చెందిన మహ్మద్​ రిజ్వాన్​ అలియాస్​ కైలాశ్​, ఆసిఫ్​నగర్​ హరిదర్గాకు చెందిన మహ్మద్​ రిజ్వాన్​ అలియాస్​ వీరూ అని సీపీ అంజనీకుమార్​ తెలిపారు. నిందితులిద్దరూ ఇదివరకే పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్టు

ఇవీచూడండి: దోపిడీ ముఠా అరెస్ట్... సొత్తు స్వాధీనం

 04-11-2019 TG_HYD_43_04_CHAIN_CUTTING_OFFENDERS_ARRST_AB_3038200 REPORTER : MALLIK.B CAM : T.RAMESH ( ) గొలుసు దొంగ తనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన ఇద్దరు నిందితులను పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. జంట నగరాల్లో పలు పోలీసుస్టేషన్ల పరిధిలో పలు గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న నిందితుల్ని పట్టుకున్నారు. హైదరాబాద్‌ హబీబ్‌నగర్‌ మంగర్‌బస్తీకి చెందిన మహ్మద్ రిజ్వాన్‌ అలియాస్ కైలాష్‌, ఆసిఫ్‌నగర్‌ హరిదర్గాకు చెందిన మహ్మద్ రిజ్వాన్‌ అలియాస్ వీరు... ఈ ఇద్దరు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మొదటి వ్యక్తి బైక్ మెకానిక్‌గా... రెండో వ్యక్తి వాటర్ సప్లై బోయ్‌గా పనిచేస్తున్నారు. మహ్మద్ రిజ్వాన్‌ను ఆది, రిజ్వాన్‌ను షాందు అనే పేర్లతో కూడా ఇరుపొరుగు వారు పిలుస్తుంటారు. వీరిద్దరూ కలిసి ఉప్పల్‌, చార్మినార్‌, హబీబ్‌నగర్, సుల్తాన్ బజార్‌, నారాయణగూడ, బేగంబజార్‌, తదితర ప్రాంతాల్లో బంగారు గొలుసు చోరీలు, జేబు దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడ్డారు. ఇద్దరు నిందితులపై మంగళహాట్, షాహినయత్‌గంజ్‌, బంజారాహిల్స్, మార్కెట్ పోలీసుస్టేషన్లలో దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. బాల్య స్నేహితులైన ఈ ఇద్దరు నిందితులు జులాయిగా తిరగడమే కాకుండా రద్దీ ప్రాంతాలు, సభల సమయంలో దొంగతనాలకు పాల్పడటం, చుట్టుపక్కల వారినే లక్ష్యం చేసుకుంటున్నారు. ఆ తర్వాత చాకచక్యంగా తప్పించుకోవడం ఆ ఇద్దరికి వెన్నతో పెట్టిన విద్యగా అలవడింది. ఈ నేపథ్యంలో చోరీలకు పాల్పడిన బంగారు సొత్తు 14.4 తులాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తు విలువ 5.60 లక్షల రూపాయలు ఉంటుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. 2016 జులై 21న మహ్మద్ రిజ్వాన్‌ అలియాస్ వీరు పీడీ చట్టంపై అరెస్టై 2017 జులై 20న కారాగారం నుంచి విడుదలై మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు సీపీ తెలిపారు. VIS.........BYTE........... అంజనీకుమార్, సీపీ, పోలీసు కమిషనరేట్, హైదరాబాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.