ETV Bharat / state

'ఒంటరిగా కనిపిస్తే చరవాణులు లాక్కుంటారు'​ - Cellphones Bikes Robbery Gang Arrest

రోడ్ల వెంబడి ఒంటరిగా ఉన్న వ్యక్తుల్నే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్​ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 6 వాహనాలు, 13 చరవాణులు స్వాధీనం చేసుకున్నామని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్​ శ్రీనివాస్​ తెలిపారు.

Chory_Gang_Arrest
Chory_Gang_Arrest
author img

By

Published : Feb 12, 2020, 4:43 PM IST

వాహనాలు, చరవాణులు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

విలాసాలకు, చెడు అలవాట్లకు బానిసలై దొంగతనాలు చేస్తూ... ప్రజలను హడలెత్తిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్​ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 ద్విచక్ర వాహనాలు, 13 చరవాణులు స్వాధీనం చేసుకున్నామని పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన నరేష్, తిరుపతి, ఎర్రగడ్డ ప్రేమ్​నగర్​లో ఉండే వెంకట్​లు ఒక గ్యాంగ్​గా ఏర్పడి చోరీలు చేస్తున్నారన్నారు.

ఏమరపాటుగా ఉన్న వారిని గమనించి ద్విచక్రవాహనంపై వచ్చి వారి మొబైల్​ఫోన్లను లాక్కుని వెళ్తున్నారని... ఇటీవల ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి... అమీర్​పేట పరిసర ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చోరీ డబ్బుతో గంజాయి, మద్యం సేవిస్తున్నారని పేర్కొన్నారు. జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి : సూర్యాపేటలో కాంగ్రెస్, తెరాస ఘర్షణ..నలుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.