ETV Bharat / state

CM KCR Latest News : పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు: సీఎం కేసీఆర్ - బీఆర్​ఎస్​ లో చేరిన మాజీ సైనికులు

Ex-servicemen joined in BRS party : ముఖ్యమంత్రి కేసీఆర్​ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ సైనికులు బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి సీఎం వారికి వివరించారు. ఈ సందర్భంగా పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Ex-servicemen joined BRS party
Ex-servicemen joined BRS party
author img

By

Published : Jul 2, 2023, 8:03 PM IST

Maharashtra ex servicemens joined in BRS Party : పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. సీఎం కేసీర్ పిలుపుతో దేశ సైనికులు బీఆర్​ఎస్​తో చేయి కలిపేందుకు ముందుకు వచ్చారు. దేశాన్ని కాపాడేందుకు ఇన్నాళ్లు దేశ సరిహద్దుల్లో పని చేసిన మాజీ జవాన్లు నేడు బీఆర్​ఎస్​ వేదికగా కిసాన్​తో జత కట్టారు. జై జవాన్, జై కిసాన్ నినాదానికి సంపూర్ణ అర్థాన్నిచ్చే దిశగా ఐక్యత చాటారు. మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు.

Army Soldiers joined in BRS Party : వారికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్పు చేసుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగాలని మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పిలుపునందుకొని రైతు రాజ్య స్థాపన కోసం దేశ జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని అన్నారు. ఇది దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు సూచన అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మరోసారి వీర సైనికుల కర్తవ్యం కొనసాగించాలి : మహారాష్ట్రలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సైనికాధికారులకు సీఎం స్వాగతం పలికారు. తెలంగాణలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం కేసీఆర్ వారికి వివరించారు. మహారాష్ట్రలో వీటిని అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పునకు దోహదం చేసే దిశగా మరోసారి వీర సైనికులై కర్తవ్య నిర్వహణను కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నాసిక్ జిల్లాకు చెందిన ఫౌజీ జనతా పార్టీ కార్యదర్శి, ప్రజాదరణ కలిగిన మాజీ సైనికుడు సునీల్ బాపురావు పగారె పార్టీలో చేరారు.

KCR Maharastra tour : మహారాష్ట్రలో సీఎం కేసీఆర్​కు అడుగడుగునా ఘనస్వాగతం

ఎవరెవరు చేరారంటే..: మాలెగావ్ నుంచి ప్రవీణ్ ఆనద్ థోకే, నాసిక్ నుంచి సాగర్ మాగ్రే, పూణే నుంచి తుకారాం దఫద్, సోలాపూర్ నుంచి సునిల్ ఆంధారె, శిరూర్ నుంచి బబన్ పవార్, డోండ్ నుంచి సందీప్ లగడ్, అకోలా నుంచి మహేశ్ చౌహాన్, బీడ్ నుంచి రాజేంద్ర కప్రే, సంగ్లి నుంచి శివాజీ నాయక్, దరాశివ్ నుంచి హరిదాస్ షిండే, వాషిమ్ నుంచి అముల్ మపరి, సూరజ్ నామ్ దేవ్ రౌత్, అజింకియా రౌత్, నంద కుమార్ కడ్సే, జల్నానుంచి దినకర్ ధోడే, అహ్మద్​నగర్ నుంచి ఉమేశ్ హండే, హడప్సర్ నుంచి నారాయణ్ తోపే, నాగ్నాథ్ గోర్పడే, సంగ్లీ నుంచి రమేశ్ సాహెబ్, దోండ్ నుంచి జైనక్ సాహెబ్ తదితర మాజీ సైనికులు బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.