అనుమానాస్పదస్థితిలో ఆర్మీ జవాను మృతి చెందిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన మురళి జమ్ముకశ్మీర్లో ఆర్మీ జవానుగా విధులు నిర్వహించేవారు. కొన్ని రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చాడు. ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులకు తెలిపాడు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేకపోవడం వల్ల... హైదరాబాద్ తిరుమలగిరిలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి మరణించాడు. తన కుమారుడు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండేదని... అతను ఏ కారణం చేత చనిపోయాడో అనే విషయాన్ని వైద్యులు కూడా సరిగా ధ్రువీకరించలేకపోవడం తమకు బాధ కలిగిస్తోందని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: మద్యంమత్తులో భవనం పైనుంచి జారిపడి వ్యక్తి మృతి