ETV Bharat / state

Argument Between Revanth Reddy And Uttam Kumar Reddy : ఒకే కుటుంబంలో 2 టికెట్లపై ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం - తెలంగాణ ఎన్నికలు 2023

Revanth Reddy Vs Uttam Kumar Reddy
Argument Between Revanth Reddy And Uttam Kumar Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 8:40 PM IST

Updated : Aug 29, 2023, 10:03 PM IST

20:32 August 29

Argument Between Revanth Reddy And Uttam Kumar Reddy : ఒకే కుటుంబంలో 2 టికెట్ల విషయంలో ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం

Argument Between Revanth Reddy And Uttam Kumar Reddy : ఎన్నికల టికెట్ల విషయంలో గాంధీభవన్​లో జరిగిన ప్రదేశ్​ ఎన్నికల కమిటీ (PEC) సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth Reddy), మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి(Uttam Kumar Reddy) మధ్య వాగ్వాదం జరిగింది. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల విషయంలో వీరిరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని తాను ఎప్పటికీ చెప్పబోనన్న రేవంత్​.. ఈ విషయంపై హైకమాండ్​ చూసుకుంటుందని తెలిపారు.

పార్టీలో రెండు టికెట్ల విషయంపై పీసీసీ అధ్యక్షుడిగా హైకమాండ్​కు రేవంత్​ రెడ్డినే చెప్పాలని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి డిమాండ్ చేశారు. తనకు ఏ విషయంపై డిక్టేట్​ చేయవద్దని రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ఇంతలో సమావేశం నుంచి ఉత్తమ్​ కుమార్ ఆగ్రహంగా వెళ్లిపోయారు. మరికొంత మంది సభ్యులు ఉదయ్​పూర్​ డిక్లరేషన్​ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంపై మాత్రం కాంగ్రెస్​ పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Pradesh Election Committee Meeting Today​ : అంతకు ముందు సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వచ్చిన దరఖాస్తులపై చర్చ జరిగింది. పీఈసీ సమావేశంలో దరఖాస్తుదారుల ఎంపిక కోసం వారి పూర్తి వివరాలను పరిశీలించడం జరిగిందని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ వెల్లడించారు. కాంగ్రెస్​ పార్టీతో దరఖాస్తుదారులకున్న అనుబంధం, పార్టీలో చేరిన తేదీ, దరఖాస్తు చేసుకున్న తేదీ, పాల్గొన్న పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలకు సంబంధించిన సమచారాన్ని... దరఖాస్తులో పొందుపరచిన వివిధ అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ నివేదికలను గాంధీభవన్​లో సెప్టెంబరు 2 జరగనున్న పీఏసీ సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు.

119 నియోజకవర్గాలు 1009 దరఖాస్తులు : మొత్తం 119 నియోజకవర్గాల ద్వారా 1006 దరఖాస్తులు వచ్చాయని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. ఒక్క ఇల్లందు నియోజకవర్గంలోనే అత్యధికంగా 38 దరఖాస్తులు వచ్చాయన్నారు. కొడంగల్​, జగిత్యాల నియోజకవర్గాలలో కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చిందని వివరించారు.

Congress MLA Tickets Applications 2023 : తరలివచ్చిన ఆశావహులు.. 1000 దాటిన దరఖాస్తులు

Congress Election Plan : సెప్టెంబరు 4న స్క్రీనింగ్​ కమిటీ ఛైర్మన్​ మురళీధరన్​, సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్​ మేవానిలు హైదరాబాద్​కు రానున్నారని మహేశ్​ కుమార్​ గౌడ్​ వెల్లడించారు. వారు మూడు రోజుల పాటు హైదరాబాద్​లోనే ఉండి.. రాష్ట్రంలోని కొన్నింటికీ నాయకత్వం వహిస్తున్న వారితో మాట్లాడి నివేదికలు రూపొందించనున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తొలి జాబితాలో టిక్కెట్లు కేటాయించాలని పీఈసీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. సీట్లు ముందుగా ప్రకటించాలని సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. పీఈసీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి... సీడబ్ల్యూసీ తొలి సమావేశం హైదరాబాద్​లో నిర్వహించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయాలని తీర్మానించామన్నారు. అయితే ఈ సమావేశంలో రేవంత్​ రెడ్డి, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి వాగ్వాదంపై మాత్రం మహేశ్​ కుమార్​ గౌడ్ ఎలాంటి స్పష్టత​ ఇవ్వలేదు.

Competition For Congress MLA Tickets : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ టికెట్‌ కోసం టఫ్ ఫైట్‌..

MLA Seethakka Fires on BRS Party : డబ్బు సంచులతో బీఆర్ఎస్ నన్ను టార్గెట్ చేస్తోంది: సీతక్క

Congress MLA Candidates Selection Telangana : నేటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ షురూ

Last Updated : Aug 29, 2023, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.