ETV Bharat / state

నేడే నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం!

జీహెచ్​ఎంసీ పరిధిలోని నేరేడ్​మెట్​ డివిజన్​ ఫలితం నేడు వెలువడే అవకాశం ఉంది. స్టాంపు ఓట్ల గందరగోళంతో ఒక్క నేరేడ్‌మెట్‌లోనే ఫలితం ఆగిపోయింది.

neredmet
నేడే నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం!
author img

By

Published : Dec 7, 2020, 7:31 AM IST

గ్రేటర్‌ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారిన నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఫలితం అధికారికంగా నేడు తేలనుంది. ఈనెల 4న 149 డివిజన్ల ఫలితాలు వెలువడగా స్టాంపు ఓట్ల గందరగోళంతో ఒక్క నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఫలితం ఆగింది. ఇక్కడ తెరాస అభ్యర్థికి వచ్చిన ఆధిక్యం కంటే ‘స్టాంపు ఓట్లు’ ఎక్కువగా పోలవడం పట్ల భాజపా అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్టాంపు ఓట్ల పరిగణన విషయంలోనే ఎన్నికల సంఘం ప్రత్యేకంగా జారీచేసిన ఉత్తర్వుల్ని హైకోర్టు సస్పెండ్‌ చేసింది. రిటర్నింగ్‌ అధికారి కౌంటింగ్‌ను నిలిపేసి ఈసీకి నివేదికను పంపారు. దీనిపై ఈసీ.. హైకోర్టును సంప్రదించింది. సోమవారం దీనిని మొదటి కేసుగా విచారించాలంటూ సింగిల్‌ జడ్జిని కోరింది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలన్న హైకోర్టు సూచించింది.

అయితే స్టాంపు ఓట్లనూ పరిగణనలోకి తీసుకోవాలని తీర్పు వస్తే.. తెరాస అభ్యర్థి 504 ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. స్టాంపు ఓట్లు 554 ఉన్నాయి. వీటిలో చెల్లనివి పక్కకు పెట్టి, అభ్యర్థులకు వచ్చినవి లెక్కగట్టినా అందులో దాదాపు తెరాస అభ్యర్థికే విజయావకాశాలున్నాయి.

ఇవీచూడండి: కసరత్తు షురూ..: కొత్త సంవత్సరంలో టీపీసీసీకి నూతన సారథి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.