వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ దృష్ట్యా చాలా మంది.. ఆ యాప్ వినియోగాన్ని మానేస్తున్నారు. కొత్త పాలసీని విశ్లేషించిన టెక్ నిపుణులు, యూజర్ల డేటాను వాట్సాప్.. ఫేస్‌బుక్‌కు అందిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు వాట్సాప్.. 'యూజర్ల డేటాను మేం ఎవరికీ ఇవ్వం' అని కూడా ప్రకటించింది. ఏది ఏమైనప్పటికీ వాట్సాప్ ఇక సురక్షితం కాదని భావిస్తున్నారు చాలామంది. ఆ మేరకు.. యాప్‌ను తొలగించేస్తున్నారు. అయితే తొలగించే ముందు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించి.. మన డేటాను మనం తీసుకోవచ్చు.
ముందుగా.. ఆండ్రాయిడ్ మొబైల్‌లో వాట్సాప్ అకౌంట్‌ను తీసేయాలంటే ఈ దిగువ స్టెప్స్ పాటించాలి.
• వాట్సాప్ ఓపెన్ చేసి టాప్‌లో ఉన్న మూడు చుక్కల ఐకాన్ క్లిక్ చేయండి.
• అందులోని 'సెట్టింగ్స్' సెక్షన్‌లోకి వెళ్లండి.
• ఆ తర్వాత 'అకౌంట్' ఆప్షన్‌లోకి వెళ్తే... 'డిలీట్ మై అకౌంట్' అని ఆప్షన్ ఉంటుంది.
• 'డిలీట్ మై అకౌంట్' ఆప్షన్‌లోకి వెళ్తే మీ మొబైల్ నెంబరును మరోసారి ఎంటర్ చేయమని అడుగుతుంది.
• మొబైల్ నెంబరు ఇచ్చాక.. 'వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయడానికి కారణమేంటి?' అని అడుగుతుంది.
• ఆ ప్రశ్నకు సమాధానమిచ్చాక.. దిగువన్న ఉన్న 'డిలీట్ మై అకౌంట్' బటన్‌ను క్లిక్ చేయాలి.
• అప్పుడు మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
• యాపిల్ మొబైల్స్‌లో అయితే 'సెట్టింగ్స్' ఐకాన్ బాటమ్ మెనూ బార్‌లోనే ఉంటుంది. మిగిలిన ప్రక్రియ ఆండ్రాయిడ్ స్టయిల్‌లోనే ఉంటుంది.
• పై ప్రాసెస్ పూర్తి చేసి వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేశాక.. ఆ ప్రక్రియ పూర్తవడానికి సుమారు 90రోజులు పడుతుంది. మళ్లీ వాట్సాప్ వాడాలనుకుంటే మీరు కొత్త ఖాతా తెరవాల్సిందే.
మీ డేటా తీసుకోవాలనుకుంటే..
వాట్సాప్ ఖాతా డిలీట్ చేసేముందు అందులోని మీ డేటాను కలెక్ట్ చేసుకోవాలనుకుంటే దానికీ ఓ ఆప్షన్ ఉంది. దాని కోసం తొలుత వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులోని అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్తే ‘రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో’ అని ఉంటుంది. దాని క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ వాట్సాప్‌కు వెళ్తుంది. అయితే మీరు అడిగిన డేటా వెంటనే మీకు అందుబాటులోకి రాదు. మీ రిక్వెస్ట్ తీసుకొని వాట్సాప్ బ్యాక్‌ఎండ్‌లో మీ డేటాను సిద్ధం చేసి నోటిఫికేషన్ పంపిస్తుంది. అప్పుడు పాత విధానంలోనే ‘రిక్వెస్ట్ ఇన్ఫో ఆప్షన్’ వరకు వెళ్తే అక్కడ ‘డౌన్‌లోడ్’ అని కనిపిస్తుంది. అక్కడ డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే జిప్ ఫోల్డర్ రూపంలో డౌన్‌లోడ్ అయిపోతుంది.
అన్నీ వద్దు అనుకుంటే..
వాట్సాప్ అకౌంట్ తీసేస్తున్నా.. మొత్తం అన్ని ఛాట్స్ అవసరం లేదు. కొన్ని మాత్రమే చాలు అనుకుంటే.. దానికీ ఓ ఆప్షన్ ఉంది. దాని కోసం ఆయా అకౌంట్/గ్రూప్ ఓపెన్ చేసి టాప్‌లో ఉన్న మూడు చుక్కల ఐకాన్‌ను క్లిక్ చేయండి. అందులో ‘ఎక్స్‌పోర్ట్ ఛాట్’ అని ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే ఆ ఛాట్ మాత్రం ఎక్స్‌పోర్ట్ అయ్యి.. మీ మొబైల్‌లో సేవ్ అవుతుంది. అయితే ఇలా చేస్తే కేవలం టెక్స్ట్ మాత్రమే లభిస్తుంది. ఒకవేళ ఫొటోలు, వీడియోలు కూడా కావాలంటే.. ఎక్స్‌పోర్ట్ గూగుల్ డ్రైవ్, జీమెయిల్ లాంటి వాటిలోకి సేవ్ అయుపోతుంది.
ఇదీ చదవండి: డేటా షేరింగ్‌పై 'వాట్సాప్' వివరణ