కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే... భాజపా నేతలు కొవిడ్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెరాస నేతలు మండిపడ్డారు. లాక్డౌన్ ఎత్తివేశాక కరోనా వ్యాప్తి పెరగడం సహజమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆస్పత్రుల వద్ద ధర్నాకు దిగిన భాజపా నేతలు... రాష్ట్రంలో కరోనా కేసులు పెరగాలని అన్నారని... వారు ఏ విషయంపై పోరాటం చేయాలనుకుంటున్నారో కూడా వారికే తెలియదని వ్యాఖ్యానించారు.
''కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై భాజపా నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేశాక, కరోనా టెస్టులు పెంచాక కేసుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. భాజపా నేతలకు ఈ మాత్రం కూడా తెలియదా..? రాష్ట్రంలో కరోనా కేసులు పెంచాలని నినాదాలు చేస్తున్నారు. దేని మీద పోరాటం చేయాలో కూడా మీకు స్పష్టత లేదు. భాజపా పాలిత ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మ్యాప్ నకిలీది.''
-ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
కలిసి పోరాడాల్సిన సమయంలో రాజకీయాలు చేయడం తగదంటూ ఎమ్మెల్యే హితవు పలికారు.