జేఈఈ మెయిన్ బీఆర్క్ పరీక్ష ముగిసింది. దేశవ్యాప్తంగా మంగళవారం రెండు పూటలు పరీక్ష జరిగింది. రాష్ట్రంలో దాదాపు 5 వేల మంది పరీక్ష రాశారు. మంగళవారం జేఈఈ మెయిన్‌కు సుమారు 15 శాతానికి పైగా గైర్హాజరు అయినట్టు తెలుస్తోంది. కరోనా పరిస్థితుల ప్రభావంతో.. కొందరు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చి పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మల్లాపూర్‌లో పరీక్ష రాసిన ఓ అభ్యర్థి.. బుధవారం కూడా పరీక్ష ఉండటం వల్ల రెండు రోజులు కారు అద్దెకు తీసుకుని వచ్చాడు. కొందరు విద్యార్థులు పరీక్ష తేదీ, కేంద్రాల విషయంలో అయోమయానికి గురయ్యారు. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్ బీటెక్ పరీక్ష జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలోని 27 కేంద్రాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది రాయనుండగా... రాష్ట్రంలో దాదాపు 67 వేల 319 మంది పరీక్షకు హాజరుకానున్నారు.
ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే..