ETV Bharat / state

ప్రొటెం ఛైర్మన్​ ఎవరో?

పెద్దలసభకు ప్రొటెం ఛైర్మన్ నియామకం తప్పనిసరి కానుంది. వచ్చే నెల మూడో తేదీతో మండలి ఛైర్మన్​తో పాటు డిప్యూటీ ఛైర్మన్ సభ్యత్వాల పదవీకాలం పూర్తి కావడమే ఇందుకు కారణం. కరోనా నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించరాదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

author img

By

Published : May 14, 2021, 3:51 AM IST

protem chairman
ప్రొటెం ఛైర్మన్​ ఎవరో?

శాసనసభ్యుల కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే నెల మూడో తేదీతో పూర్తి కానుంది. మండలి ఛైర్మన్​గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్​తో పాటు చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్ ఉన్నారు. సాధారణంగా పదవీకాలం పూర్తయ్యే లోపు ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ కొవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ఇప్పట్లో నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో జూన్ మూడో తేదీలోగా ఆ స్థానాలు భర్తీ కావు. ప్రస్తుత సభ్యుల పదవీకాలం పూర్తయ్యాక ఆరుస్థానాలు ఖాళీగా ఉంటాయి. దీంతో మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ సభ్యత్వాలు కూడా పూర్తై రెండు పదవులు ఖాళీ అవుతాయి.

రాజ్యాంగంలోని 184వ ఆర్టికల్ ప్రకారం శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీ అయితే ప్రొటెం ఛైర్మన్​ను నియమించాల్సి ఉంటుంది. 2011లో ఇదే తరహా సందర్భం వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్​గా ఉన్న చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్​గా ఉన్న మహ్మద్ జానీ పదవీకాలం పూర్తి కావడంతో రెండు పదవులూ ఖాళీ అయ్యాయి. దీంతో అప్పట్లో సీనియర్ ఎమ్మెల్సీ అయిన సింగం బసవపున్నయ్యను ప్రొటెం ఛైర్మన్​గా నియమించారు. ప్రొటెం ఛైర్మన్​గా రాజ్​భవన్​లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. అదే తరహాలో జూన్ మూడో తేదీ తర్వాత ఇప్పుడు కూడా శాసనమండలికి ప్రొటెం ఛైర్మన్​ను నియమించాల్సి ఉంటుంది.

నియామకం అనంతరం ప్రొటెం ఛైర్మన్​చే గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఆయన ప్రొటెం ఛైర్మన్ హోదాలో మండలి ఛైర్మన్ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు. సభాకార్యకలాపాల నిర్వహణ సహా ఛైర్మన్​కు ఉండే అన్ని అధికారాలు, హోదా ప్రొటెం ఛైర్మన్ కు వర్తిస్తాయి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తే మండలి సమావేశాల నిర్వహణతో పాటు ఛైర్మన్ ఎన్నిక కూడా చేపట్టవచ్చు. కొత్త ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తై బాధ్యతలు స్వీకరించే వరకు ప్రొటెం ఛైర్మన్ పదవిలో ఉంటారు. ఈ పదవికి శాసనమండలి సభ్యులైన వీజీ గౌడ్​, నారదాసు లక్ష్మణరావు, డి.రాజేశ్వర్​, ఫారూఖ్​ హుస్సేన్​ల పేర్లను ప్రభుత్వం పరిశీలించనుంది. ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్​ నియమిస్తారు.

ఇదీ చదవండి: 'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.