ETV Bharat / state

6న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ​

వచ్చే నెల 6న అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జల్​శక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమాచారం ఇవ్వాలంటూ కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ కార్యదర్శికి సూచించారు.

apex council meeting on october sixth
6న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ​
author img

By

Published : Sep 29, 2020, 6:59 AM IST

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం అక్టోబరు 6న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు 2014లో ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే సమావేశమైంది. ఆగస్టు 5న రెండో సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించగా.. 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరటం వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి కరోనాతో ఆసుపత్రిలో చేరారు.

తాజాగా అక్టోబరు 6న జరపాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నిర్ణయించారు. రాష్ట్రాలకు సమాచారం ఇవ్వాలంటూ కార్యదర్శికి సూచించినట్లు తెలిసింది. ఈ కౌన్సిల్‌కు కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌ కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు.

ఎజెండాలోని అంశాలివే..

  • కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటై ఆరు సంవత్సరాలైనా ఇప్పటివరకు వాటి పరిధిని కేంద్రం గుర్తించలేదు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చిన తర్వాత బోర్డు పరిధిని నిర్ణయించాలని తెలంగాణ కోరుతుండగా, ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ అడుగుతోంది.
  • రాష్ట్రాలు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టినపుడు వాటి సమగ్ర నివేదిక(డీపీఆర్‌)లను బోర్డులకు అందజేయాలి. కొత్త ప్రాజెక్టుల గురించి రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి తప్ప సంబంధిత డీపీఆర్‌లు ఇవ్వడం లేదని కృష్ణా, గోదావరి బోర్డులు ఆరోపిస్తున్నాయి. తమ దగ్గర కొత్త ప్రాజెక్టులు లేనందువల్లే డీపీఆర్‌లు ఇవ్వలేదని రాష్ట్రాలు చెబుతున్నాయి.
  • పోలవరం నిర్మాణం ద్వారా కృష్ణాలోకి మళ్లించి, కృష్ణా డెల్టాలో వినియోగించే 80 టీఎంసీల గోదావరి జలాల్లో 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునసాగర్‌ ఎగువ భాగాన వినియోగించుకోవాల్సి ఉంది. నాగార్జునసాగర్‌ ఎగువన కృష్ణా పరీవాహక ప్రాతమంతా తమ పరిధిలోనే ఉంది కాబట్టి ఆ వాటా నీళ్లు తమకే చెందుతాయని తెలంగాణ పేర్కొనగా, నీటి పంపిణీ అంశం ట్రైబ్యునల్‌ తేల్చాలి తప్ప కమిటీలు కాదని ఆంధ్రప్రదేశ్‌ వాదిస్తోంది.
  • పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి బోర్డు కార్యాలయం హైదరాబాద్‌లో, కృష్ణా బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో ఉండాలి. విజయవాడకు తరలించే ప్రతిపాదనపై చర్చలు జరగడం తప్ప నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ చర్చించనుంది.

ప్రధాన చర్చ కొత్త ప్రాజెక్టులపైనేనా!

శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పట్ల తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డులోనూ దీనిపై చర్చించింది. ఆంధ్రప్రదేశ్‌ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను ప్రధానంగా తెరమీదకు తెస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లొద్దని కేంద్రం సూచించడం, తెలంగాణ అభ్యంతరం నేపథ్యంలో ఎజెండాలో లేని ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదీచూడండి: కొత్త రెవెన్యూ మార్గదర్శకాల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.