ETV Bharat / state

Fevers: ఏపీలో ఓవైపు కరోనా.. మరోవైపు విషజ్వరాల విజృంభణ - ap news

ఏపీలో ఓవైపు కొవిడ్​ కేసులు, మరోవైపు జర్వాలు... ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా, డెంగీ లక్షణాలు ఒకేలా ఉండటంతో మరింత గందరగోళానికి గురవుతున్నారు. అత్యధికంగా విశాఖ జిల్లాలో డెంగీ, మలేరియా, గన్యా కేసులు నమోదవుతున్నాయి.

fever
fever
author img

By

Published : Sep 8, 2021, 9:31 AM IST

ఏపీలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కరోనా, డెంగీ లక్షణాలు ఒకేలా ఉండటంతో మరింత గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ జిల్లాలో డెంగీ, మలేరియా, గన్యా కేసులు నమోదవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. మలిదశ కొవిడ్‌ తగ్గకుండానే విషజ్వరాలు, డెంగీ కేసులు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. జ్వరపీడితుల సంఖ్యకు తగ్గట్లు ఆసుపత్రుల్లో సేవలు అందట్లేదు. ముఖ్యంగా రక్తపరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సి వచ్చి వేలల్లో ఖర్చవుతోంది. మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి భారీగా రోగులు వస్తున్నా, జ్వర నిర్ధారణ కిట్లు లేవు.

  • ప్రకాశం జిల్లా చీమకుర్తి ఆసుపత్రిలో రక్తపరీక్షలు చేసేందుకు ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేరు. ఉలవపాడు, కనిగిరి, కంభం, యర్రగొండపాలెం, గిద్దలూరు, పెదదోర్నాలలో సీబీపీ యంత్రాలు లేవు. చీరాల ఏరియా ఆస్పత్రిలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌, వంటి పరీక్షలు చేయాల్సి ఉండగా ఒక ల్యాబ్‌ సహాయకుడే ఉన్నారు. ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురంలో డెంగీ నిర్ధారణ పరీక్షకు సౌకర్యం ఉన్నా, ఫలితాలకు రెండు, మూడు రోజుల సమయం పడుతోంది.
....
  • శ్రీకాకుళం జిల్లాలో వైద్యులు లేక బాధితుల పరిస్థితి వర్ణనాతీతం. టెక్కలి మండలం కె.కొత్తూరు పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులుండగా ఒకరు ప్రసూతి సెలవుపై వెళ్లారు. మరొకరు కొవిడ్‌ టీకా కార్యక్రమం పరిశీలనకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. మరొకరిని ఇక్కడ ఇంఛార్జిగా నియమించినా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటేనే వస్తున్నారు. దీనివల్ల స్టాఫ్‌ నర్సులే రోగులను పరీక్షించి మందులు ఇస్తున్నారు.
  • విశాఖ నగరవ్యాప్తంగా ఉన్న 20 ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాల్లో ఆరోగ్యసేవలు అందించేందుకు ఇన్నాళ్లూ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ గడువు పూర్తయింది. వారంరోజులుగా ఆయా కేంద్రాల్లో సేవలు బాగోలేవు. రక్త పరీక్షలూ బయటే చేయించుకోవాలని వైద్యులు రోగులకు చెబుతున్నారు.

పశ్చిమగోదావరిలో ముగ్గురి మృతి

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరులో కౌలు రైతు కాజా శ్రీనివాస్‌ (38) విషజ్వరం బారిన పడ్డాడు. భీమవరంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆకివీడు మండలం దుంపగడపకు చెందిన కొట్టు నాగభూషణం (30) విషజ్వరం బారినపడి మృతిచెందారు. ఇతనికి ప్లేట్‌లెట్లు బాగా పడిపోయాయి. డెంగీ సోకినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. అయినా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం విషజ్వరం గానే పరిగణించింది. బుట్టాయగూడెం మండలం వీరమద్దిగూడేనికి చెందిన గోగుల సింధు (10) అనే బాలిక డెంగీ లక్షణాలతో గతవారం మృతిచెందింది. ఈమె జ్వరం, వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడింది. స్థానికంగా చికిత్స అనంతరం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకువస్తుండగా మృతి చెందింది. మలేరియా కారణమని స్థానిక వైద్యాధికారులు తెలిపారు.

...

లక్షణాల ఆధారంగా నిర్ధారణ, చికిత్స

దోమల వల్ల డెంగీ వస్తోంది. తీవ్ర జ్వరం, నీరసం, ఒళ్లునొప్పులు ఉంటే అదేంటో తెలుసుకోడానికి వైద్యులను సంప్రదించి, లక్షణాలు చెప్పాలి. చెప్పిన పరీక్షలు చేయించుకోవాలి. ముక్కు కారుతూ, గొంతునొప్పి, జ్వరం వస్తే కోల్డ్‌ వైరస్‌ (సీజనల్‌)గా భావిస్తున్నాం. కొవిడ్‌ అయితే ఇలాగే ఉన్నా... తగ్గి, మళ్లీ ఆరు లేదా ఏడో రోజున దగ్గు ఎక్కువగా వస్తోంది. డెంగీలో ఒళ్లునొప్పులు తీవ్రంగా ఉంటాయి. కామెర్లూ రావొచ్చు. ఆరేడు రోజులకు నీరసం వస్తోంది. ఏడెనిమిది రోజులకు కొందరికి చర్మంపై ఎర్రమచ్చలు వస్తాయి. డెంగీలో ప్లేట్‌లేట్లు పడిపోయి, రక్తస్రావమయ్యే ప్రమాదం ఉంది. లక్షణాలు అనుసరించి, పరీక్షల ఫలితాల ఆధారంగా చికిత్స అందిస్తున్నాం. - ప్రొఫెసర్‌ వెంకటకృష్ణ, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ, విజయవాడ జీజీహెచ్‌

ఇదీ చూడండి: Fevers: పెరుగుతున్న మలేరియా, డెంగీ కేసులు... అదే ప్రధాన కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.