ETV Bharat / state

కరోనా కష్టాలు.. రాష్ట్రం నుంచి ఏపీకి వెళ్లేవారికి నో ఎంట్రీ - people who came from telangana suffering at inter state border

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు... ఎంతో శ్రమించి అనుమతి సంపాదించారు. హైదరాబాద్‌ నుంచి సొంత వాహనాల్లో బయల్దేరారు. తీరా ఆంధ్రా​ సరిహద్దు చేరుకునే సరికి.... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోకి ప్రయాణికులను అనుమతించబోమని... ఏపీ అధికారులు నిలిపివేశారు. భారీ ట్రాఫిక్ జామ్.. అధికారులతో వాహనదారుల వాగ్వాదం... ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి జరిగిన పరిణామాలివి.

Corona problems
Corona problems
author img

By

Published : Mar 26, 2020, 6:22 AM IST

హైదరాబాద్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వెళ్లిన ప్రయాణికులను ఏపీలోని కృష్ణా జిల్లా గరికపాడు చెక్​పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకూ ఆందోళన కొనసాగింది. క్వారంటైన్​కు ఒప్పుకుంటేనే అనుమతిస్తామన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో... బాధితులు గంటల పాటు ఇబ్బందులు పడ్డారు.

ఉన్నతాధికారులు అనుమతిస్తేనే

హైదరాబాద్‌లో హాస్టళ్లు, మెస్‌లు మూసివేయాలన్న యజమానుల నిర్ణయంతో... అక్కడ ఉంటున్నవారంతా స్వస్థలాలకు వరుస కట్టారు. తెలంగాణ పోలీసుల వద్ద అనుమతి తీసుకుని... సొంత వాహనాల్లో ఏపీకి బయల్దేరారు. 2.. 3 గంటల్లో ఇళ్లకు చేరుకుంటామనుకుంటున్న వారిని ఆంధ్రా సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు మూసివేసినట్లు వివరించారు. మరీ ముఖ్యమైన పనులుంటే ఉన్నతాధికారుల అనుమతి కావాలని తేల్చి చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి వచ్చిన వాహనాలన్నీ నిలిపివేయడం వల్ల హైదరాబాద్‌ - విజయవాడ రహదారిపై 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు వేయి మందికి పైగా ప్రయాణికులతో... రహదారి కిక్కిరిసిపోయింది.

క్వారంటైన్​లో ఉంటేనే అనుమతి

ఆంధ్రాలోని కృష్ణాజిల్లా గరికపాడు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్న కృష్ణా జిల్లా సబ్‌కలెక్టర్‌ ధ్యాన్‌చంద్‌... రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రయాణికులకు సూచించారు. అందరి వివరాలు తీసుకుని... నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తామని స్పష్టం చేశారు. అయోమయంలో పడిన ప్రయాణికులు.... అధికారులతో వాగ్వాదానికి దిగారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్... గరికపాడు వద్దకు చేరుకుని నందిగామ డీఎస్పీతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం... క్వారంటైన్ తప్పదని ఏపీ పోలీసులు తేల్చి చెప్పారు.

అంగీకరించిన వారికి అనుమతి

చాలాసేపటి తర్వాత... క్వారంటైన్‌లో ఉండేందుకు సుమారు 100 మంది ప్రయాణికులు అంగీకరించారు. మిగిలిన వారిని తిరిగి హైదరాబాద్‌ వెళ్లాలన్న అధికారులతో... వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి పొందినప్పటికీ... రాష్ట్ర సరిహద్దులో అడ్డుకోవడం ఏంటని... ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికక్కడే ఆరోగ్య పరీక్షలు నిర్వహించవచ్చని అధికారులను కోరారు. ఉదయం నుంచి వందల సంఖ్యలో కార్లను అనుమతించిన అధికారులు..... తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

ప్రయాణికుల అవస్థలు

క్వారంటైన్‌కు అంగీకరించిన వారిని అధికారులు ప్రత్యేక బస్సుల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీకి తరలించారు. మిగిలినవారంతా అధికారులతో వాగ్వాదానికి దిగారు. సొంత రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకా... పొరుగు రాష్ట్రానికి వెళ్లే దారి లేక... ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ తిరుగుముఖం పట్టిన వారిలో.. కొందరు మళ్లీ గరికపాడు చేరుకుని తమను ఇళ్లకు పంపాలని అభ్యర్థించారు. అధికారులు నచ్చజెప్పి హైదరాబాద్‌ పంపారు.

కరోనా కష్టాలు.. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి నో ఎంట్రీ

ఇదీ చూడండి:

ప్రమాదం పొంచి ఉంది...తస్మాత్ జాగ్రత్త..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.