ETV Bharat / state

ఏపీ పోలీసు శాఖకు రికార్డు స్థాయిలో జాతీయ అవార్డులు

సాంకేతిక వినియోగంలో ఆంధ్రప్రదేశ్​ పోలీసు శాఖకు అవార్డుల పంట పండింది. జాతీయ స్థాయిలో 84 అవార్డుల్లో 48 అవార్డులను ఏపీ పోలీసులు దక్కించుకున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులను రాష్ట్ర పోలీసులు సొంతం చేసుకున్నారు.

ఏపీ పోలీసు శాఖకు రికార్డు స్థాయిలో జాతీయ అవార్డులు
ఏపీ పోలీసు శాఖకు రికార్డు స్థాయిలో జాతీయ అవార్డులు
author img

By

Published : Oct 28, 2020, 9:25 PM IST

సాంకేతికత వినియోగంలో జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్​ పోలీసు శాఖ సత్తా చాటింది. స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్​లో జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 84 అవార్డుల్లో 48 అవార్డులను ఏపీ పోలీసులు దక్కించుకున్నారు. సాంకేతికత వినియోగంలో అవార్డులను వరుసగా రెండోసారి ఆ రాష్ట్ర పోలీసులు కైవసం చేసుకున్నారు.

ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులను దక్కించుకోగా, తాజాగా వివిధ విభాగాల్లో 48 అవార్డులు సొంతం చేసుకున్నారు. మొత్తం 85 అవార్డులతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ పోలీసు శాఖ నిలిచింది. అవార్డులు దక్కించుకున్న వారిని ఏపీ ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు.

ఇదీ చదవండి: రేపటి నుంచి అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.