ETV Bharat / state

AP municipal elections 2021: కొనసాగుతున్న 'పుర' ఓట్ల కౌంటింగ్‌.. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే? - కుప్పం ఎన్నికల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారి నియామకం

ఏపీలో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు (AP municipal elections 2021 ) కొనసాగుతోంది. మధ్యాహ్నానికి 1,206 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే?

AP municipal elections 2021
కొనసాగుతున్న 'పుర' ఓట్ల కౌంటింగ్‌.. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే?
author img

By

Published : Nov 17, 2021, 11:51 AM IST

ఆంధ్రప్రదేశ్​లో నగరపాలక, పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు(AP municipal elections 2021 ) కొనసాగుతోంది. మధ్యాహ్నానికి 1,206 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వైకాపా, తెలుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కుప్పం.. ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ రేపుతోంది. కుప్పం ఎంఎఫ్‌సీ వృత్తి విద్యా కళాశాలలో లెక్కింపు(Kuppam muncipal election results 2021) కొనసాగుతోంది.

ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. కడప జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లా బేతంచర్ల పురపాలికలు, కడప జిల్లా కమలాపురం, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలను వైకాపా కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో తెదేపా విజయం సాధించింది.

కుప్పంలో మొత్తం 25 వార్డులకు ఒక వార్డు ఏకగ్రీవం కాగా... మిగిలిన 24 వార్డుల్లో లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకు 10 వార్డుల్లో వైకాపా, ఒక వార్డులో తెదేపా గెలుపొందింది. మిగతా స్థానాల్లో లెక్కింపు జరుగుతోంది.

పోలింగ్‌ సందర్భంగా తలెత్తిన అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకుని... పటిష్ట భద్రత మధ్య ఓట్లు లెక్కిస్తున్నారు. ఏపీ హైకోర్టు నియమించిన ప్రత్యేక అధికారి ఐఏఎస్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో లెక్కింపు కొనసాగుతోంది. ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసి వారం రోజుల్లో తమకు సమర్పించాలని ఎస్​ఈసీని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి: lathi charge by police: కుప్పంలో ఉద్రిక్తత.. తెదేపా నేతలపై లాఠీఛార్జ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.