ETV Bharat / state

MP Raghurama: రఘురామపై దాడిని ఖండించిన ఎంపీలు! - వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తలు

ఆంధ్రప్రదేశ్ నర్సపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడిని పార్లమెంట్ సభ్యులు ఖండించారు. ఇది పార్లమెంటుకు జరిగిన అవమానంగా వారు అభివర్ణించారు.

Raghurama
Raghurama: ఎంపీ రఘురామపై దాడిని ఖండించిన ఎంపీలు!
author img

By

Published : Jun 7, 2021, 7:22 AM IST

చట్టసభ సభ్యుడిపై క్రూరమైన దాడి పార్లమెంటుకు జరిగిన అవమానమని కొల్లాం లోక్‌సభ సభ్యుడు (ఆర్‌ఎస్పీ) ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నర్సపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది అమానవీయం, క్రూరం, అనాగరికమని ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని, రఘురామకృష్ణరాజుకు అండగా నిలుస్తామని వెల్లడించారు. ఎంపీ పంపిన లేఖకు ఆయన మెయిల్‌ ద్వారా స్పందించారు.

  • ఎంపీ రఘురామరాజుపై క్రూరంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని దిల్లీ పశ్చిమ లోక్‌సభ సభ్యుడు పర్వేష్‌ సాహెబ్‌సింగ్‌ వర్మ (భాజపా) ట్వీట్‌ చేశారు. ఆయన తప్పేమిటి? వారు చేస్తున్న బలవంతపు మతమార్పిళ్లకు, మిషనరీస్‌కు వ్యతిరేకంగా గళం విప్పడమేనా అని ప్రశ్నించారు.
  • ఎంపీపై ఏపీ పోలీసులు కస్టడీలో దాడి చేశారన్న అంశం తన దృష్టికి వచ్చిందని బెర్హంపూర్‌ లోక్‌సభ సభ్యుడు(బీజేడీ) చంద్రశేఖర్‌సాహూ ట్వీట్‌ చేశారు. న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
  • ఏపీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పుకొంటున్న వారు ఎంపీ రఘురామకృష్ణరాజుపై కనికరం లేకుండా దారుణంగా కొట్టిన చిత్రాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాయని పూరి ఎంపీ పినాకిమిశ్రా (బీజేడీ) ట్వీట్‌ చేశారు. దీన్ని తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా రీట్వీట్‌ చేశారు.

ఎంపీలకు ప్రాంతీయ భాషల్లో రఘురామ లేఖ

ఏపీ పోలీసులు కస్టడీలో తనపై క్రూరంగా దాడి చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యులకు అన్ని ప్రాంతీయ భాషల్లో లేఖలు పంపారు. ఎంపీ ఆంగ్లంలో రాసిన లేఖ అందుకున్న పలువురు ఎంపీలు తమ ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేయించి ఆ లేఖ పంపాలని కోరినట్లు తెలిసింది. ఈ మేరకు ఎంపీ కసరత్తు చేయిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'వ్యవసాయంపై కొవిడ్​ 2.0 ప్రభావం ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.