హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బోగస్ ఓట్లు వేస్తున్నారని బ్యాంక్ ప్రస్తుత ఛైర్మన్ రమేశ్ బంగ్ వర్గంపై భగవతి దేవి ఆరోపణలతో... పోలింగ్ బూత్ వద్ద ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.
ఎల్బీ స్టేడియం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. మళ్లీ ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా హైదరాబాద్ నగర సంయుక్త పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 32వేల మంది ఖాతాదారులు ఓటు హక్కు వినియోగిచుకుంటున్నారు.
ఇదీ చదవండి: రేసింగ్‌లో విన్యాసాలు చేశారు... పోలీసులు అరెస్ట్ చేశారు